telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మూడవ బిడ్డకు జన్మనివ్వబోతున్న యష్ దంపతులు… క్లారిటీ ఇచ్చిన రాధిక

Yash

“కేజీఎఫ్” సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు కన్నడ స్టార్ యష్. కాగా యష్ తాజాగా తన భార్య రాధికతో కలిసి ఉన్న ఒక ఫొటో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఆ ఫొటోలో యష్ తన నుదిటిపై మూడు వేళ్లతో చూపిస్తున్నట్లుగా ఉన్నాడు. దీంతో కొందరు మూడవ బిడ్డకు వీళ్లు జన్మనివ్వబోతున్నారా ? అనే అనుమానం వ్యక్తం చేశారు. దాంతో ఆ ఫొటోపై వస్తున్న కామెంట్స్ కు రాధిక స్పందించింది. తాను మరోసారి ప్రెగ్నెంట్ అంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదని క్లారిటీ ఇచ్చింది. తాము ఇద్దరు పిల్లలతో చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నట్లుగా పేర్కొంది. మూడవ సంతానం గురించి ఆమె ఆలోచన లేదన్నట్లుగా పేర్కొంది. ప్రస్తుతం యష్ “కేజీఎఫ్-2” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నద్ధమవుతున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

Related posts