telugu navyamedia
సినిమా వార్తలు

నయనతారకు ఎందుకు సారీ చెప్పాలి ? : రాధారవి

Nayanatara-and-Radharavi

గత కొన్నిరోజుల క్రితం నయనతారపై అనుచిత వ్యాఖ్యలు చేసి కోలీవుడ్ మీడియాలో సంచలనం సృష్టించిన రాధా రవి వివాదం ముదురుతుండటంతో ఆ తర్వాత క్షమాపణలు చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై సినిమా ప్రముఖులు మండిపడ్డారు. రాధారవి క్షమాపణలు చెప్పడంతో అందరూ ఈ విషయం ఇంతటితో ముగిసిందని అనుకున్నారు. కానీ అగ్నికి ఆజ్యం పోసినట్టుగా… తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన రాధారవి మరోసారి ఈ విషయంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

ఓ లఘుచిత్ర కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన రాధారవి గతంలో నయనతార విషయాన్ని గుర్తుచేస్తూ తాను తప్పుగా మాట్లాడి ఉంటే తన మాటలను వెనక్కి తీసుకుంటానని చెప్పానే కానీ ఎవ్వరికీ క్షమాపణలు మాత్రం చెప్పలేదని తెలిపారు. అలా చెప్పడం తన రక్తంలోనే లేదని ఆయన అన్నారు. ‘‘నేను నయనతారకు ఎందుకు సారీ చెప్పాలి? నేనేమైనా పెద్ద తప్పు చేశానా? ఈ రోజు నేను మాట్లాడుతుంటే జనం ఎలా అయితే చప్పట్లు కొట్టారో.. ఆ రోజు కూడా జనం అలాగే చప్పట్లు కొట్టారు. నిజం మాట్లాడిన ప్రతీ సారి జనం మద్దతు నాకే ఉంటుంది. నేనిక సినిమాల్లో నటించకూడదని చాలా మంది బెదిరిస్తున్నారు. సినిమాలు కాకపోతే నాటకాలు చేసుకుంటా… ఇలాంటివన్నీ తాత్కాలికమే’’ అని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

Related posts