telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

కాల్షియం టాబ్లెట్స్ కంటే.. రాగిజావ చాలా మేలు.. ఎందుకో తెలుసా..!

శరీరానికి కృత్రిమ పదార్దాల కంటే ప్రకృతిలో సహజ సిద్దంగా లభించే వాటితోనే చాలా మేలు జరుగుతుంది. తద్వారా ఆరోగ్యం చేకూరుతుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఇక ఆ ఆరోగ్యం కోసం మనం రోజు తీసుకునే అనేక మందుల స్థానంలో సహజసిద్ధంగా లభించే వాటిని ఆహారంలో చేర్చుకోవడం ఎంతో ఉత్తమం అంటున్నారు నిపుణులు. ఉదాహరణకు ఆడవారిలో కానీ మిగిలిన వారిలో వయసు మీద పడే వారిలో సహజంగా వచ్చే సమస్య, ఎముకల బలహీనత. దీనికి కారణం శరీరంలో తగిన కాల్షియం లేకపోవడమే. దానిని భర్తీ చేయడానికి మందులు వాడేకంటే; రాగులతో జావ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది అంటున్నారు. రాగులలో మనకు తెలియని ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి. ఇతర గింజల్లో వేటిల్లో లేనంత కాల్షియం నిల్వలు రాగుల్లో ఉన్నాయి. ఎముకల బలహీనతను అరికట్టడంలో రాగులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. రాగుల్లోని ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం.

raagi java is best than calcium tabletsa* పిల్లలు పుష్టిగా, వారి ఎముకలు బలంగా ఎదగాలంటే ప్రతిరోజూ రాగి జావ ఇస్తుండాలి.

* రాగుల్లో కొవ్వు తక్కువ కనుక అధిక బరువుతో సతమతమయ్యేవారు వీటిని తీసుకుంటుంటే బరువు తగ్గుతారు. గోధుమలు, అన్నం కాకుండా రాగులు తీసుకుంటుంటే బరువు కంట్రోల్ అవుతుంది.

* అమినో ఆసిడ్లు ఉండటం వల్ల అధిక బరువు ఉన్నవారు ఆ సమస్య నుండి మామూలు స్థితికి వచ్చే అవకాశం చాలా ఎక్కువే ఉంది.

* అత్యధిక స్థాయిలో పాలిఫెనాల్, ఫైబర్ ఉండడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయిలను ఇది క్రమబద్ధీకరిస్తుంది. గ్లూకోజ్ లెవల్స్ సాధారణ స్థితిలో ఉంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. టైప్ 2 డయాబెటిస్ వ్యాధికి ఇది మంచి మందుగా కూడా పనిచేస్తుంది.

* సహజసిద్ధంగా కావల్సినంత ఇనుము ఇందులో లభ్యమవుతుంది. అనీమియాతో బాధపడేవారు హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకునేందుకు రాగులను తీసుకుంటుంటే మంచి ఫలితం ఉంటుంది. విటమిన్ సి స్థాయిలను కూడా ఇది పెంచుతుంది.

Related posts