telugu navyamedia
సినిమా వార్తలు

నాని “గ్యాంగ్ లీడర్” ఫస్ట్ సాంగ్

Gang-Leader

నాని, విక్రమ్.కె.కుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం “గ్యాంగ్ లీడ‌ర్” . మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం) నిర్మిస్తున్నారు. ఇందులో ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ కీలక పాత్రను పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచంద్రన్ అందిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవ‌ల విడుదల చేశారు. బామ్మ, వరలక్ష్మి, ప్రియ, స్వాతి, చిన్ను..రివెంజర్స్ అసెంబుల్ అనే వ్యాఖ్యను జోడించిన ఫస్ట్‌లుక్ ఆసక్తిని రేకెత్తించింది. విభిన్నమైన పాయింట్‌తో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ఓ గ్యాంగ్ ప్రతీకారం నేపథ్యంలో సాగుతుంది. సినిమాలోని తొలి పాటను ఈ రోజు సాయంత్రం 7 గం.లకి విడుద‌ల చేశారు. “రా..రా…” అంటూ సాగే ఈ పాట సంగీత ప్రియుల‌ని అలరిస్తోంది. ఇక చిత్ర టీజర్‌ను 24న విడుదల చేయనున్నారు. ఆగస్టు 30న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Related posts