telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

కన్నీళ్ల విలువెంత..ఆడదాని ఆవేదనంత

ఆరాధించే మనిషి నుండి నిరాదరణ ఎదురైతే

అనుభవించే అతివ మనసు పడే ఆక్రోశమంత…

ఆధారపడిన జన్మనని హక్కులేవి ఉండవని

అర్హత ఉన్నా అందలమెక్కని ఆలి ఆవేదనంత…

ఊహలకి తనే ఊతమని ఊపిరే తన సొంతమని

ఉక్కిరిబిక్కిరి చేస్తే ఎవరికీ చెప్పుకోలేని ఏకాకితనమంత…

అంతులేని అనుభూతికి రూపమని మదినిండ

నిండినా ఎమెరుగనట్టి నటన హృదయ భారమంత…

గుండెని గుడిచేస్తే ఊరేగింపు స్వామిలా ఊరుమీదపడి కృష్ణలీలల్ల గర్వపడితే గతితప్పిన గయ్యాళి బతుకంత… 

బిడ్డల భవిష్యత్తుకై అడ్డదిడ్డ ఒడిదుడుకుల పయనాన్ని

ఓపికతో జంట సుతిలేక ఏటికి ఎదురీదే ఆరాటమంత…

ఎంతచేసినా అంతా కోల్పోయినా చితికి చేరేవరకు

చేవంతా పీల్చి పిప్పిచేసే అయినోళ్ల ఆత్మీయతంత…

ఆడదై ఆలియై అమ్మయై జీవితమంతా పోరాటం

చేసినా దశ తిరగని సగటు భారత స్త్రీ సహనమంత…

Related posts