telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

మహిళల మనసులు

అందాల సుందరాంగులం మేమైనా
రంగవల్లుల సింగారం మాదైనా
రమణుల జిలుగు వెలుగులు ఇంపైనా
నవ్వుల పువ్వులు మా చెంతైనా
ఇంద్రధనస్సు వర్ణాలు మాలో ఉన్నా
తరగని మనోనిబ్బరం మా సొంతమైనా
తడబడని చుాపులు మావైనా
నిజంగా నిక్కచ్చిగా చెపుతున్నాం
పుట్టినప్పుడు అమ్మ వడి
పెరిగినప్పుడు నాన్న దరి
బుడి బుడి నడకల బుడ్డోడికి తోడై
అల్లరి పిల్లలా అన్నతిొ ఆటై
అచ్చిక బుచ్చికలు మచ్చికలై
స్నేహమయులై
పుట్టినింట పసికునలమై
మెట్టినింట ఆరిందలమై
మగని నీడంటుా మురిపమంటుా
ప్రియుడి పులకరింతంటుా
శ్రీలక్ష్మి అంటుా ప్రశ్నిస్తే పొగరంటుా
ఆత్మాభిమానం అవసరమా మీకంటుా
మంత్రి అంటుా దాసి అంటుా
యజమానంటుా ఆడదానివంటుా
ఈడమాటలేలంటుా
ఏమి తెలియదంటుా
మెుద్దంటుా పిచ్చంటుా
ఏవగింపుల మాటలంటుా
ఏడిపిస్తుా మనసు మౌనాలు మీవంటుా
రాతరాసిపోయెనేమెా దైవమే
పుట్టి చచ్చువరకు మగవాడితోడు తధ్యమంటుా
అమ్మలగన్న అమ్మలకు మించిన దైవమై
పక్షపాతివే నీవైతివి భగవంతుడా
భామల మనసులెల్ల అఖాతమాయనే
గాంచలేవు ఎందుకో నీవయ్యా!….

Related posts