telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

వర్ణమాలతో పెళ్ళి ఆహ్వానం

marriage

వర్ణమాలతో పెళ్ళి ఆహ్వానం* 

 

 *అ* – *అరుదైన* అమ్మాయి

 *ఆ* – *ఆకతాయి* అబ్బాయి

 *ఇ* – *ఇద్దరికి* 

 *ఈ* – *ఈడు* జోడి కుదిరి

 *ఉ* – ఉంగరాలను తొడిగి

 *ఊ* – ఊరంతా ఊరేగించారు

 *ఋ* – *ఋణాల* కోసం 

 *ఎ* – *ఎ* వరెవరినో అడుగుతూ ఉంటే

 *ఏ* – *ఏనుగు* లాంటి కుభేరుడితో అడిగి

 *ఐ* – *ఐశ్వర్యం* అనే కట్నం ఇచ్చి

 *ఒ* – *ఒకరికి* ఒకరు వియ్యంకులవారు

 *ఓ* – *ఓర్పుతో* ఒప్పందం చేసుకొని

 *ఔ* – *ఔదార్యాని* ఇరు కుటుంబాలకు

 *అం* – *అందించాలని* కోరుకుంటూ

 *అ* : – *అ* : అంటూ

 *క* – *కలపతో* తయారయిన పత్రికలపై 

కలంతో రాసిచ్చి

 *ఖ* – *ఖడ్గాలతో* నరికిన పందిరి ఆకులను

 *గ* – *గడప* ముందుకు తీసుకొచ్చి

 *ఘ* – *ఘనమైన* ఏర్పాట్లు చేయించి

 *చ* – *చాపుల* (బట్టలు)నింటిని కొని

 *ఛ* – *ఛత్రం* (గొడుగు) పట్టి గండదీపాని

 *జ* – జరిపిస్తూ

 *ఝ* – *ఝాము* రాత్రి దాక

 *ట* – *ట* పకాయలను కాలుస్తూ

 *ఠ* – *ఠీవిగా* (వైభవంగా)

 *డ* – *డ* ప్పులతో

 *ఢ* – *ఢం* ఢం అని శబ్దాలతో సాగుతుంది

 *ణ* – కంక *ణా* లు చేతికి కట్టుకొని

 *త* – *తట్టలో* తమలపాకులు పట్టుకొని

 *థ* – థమన్(మ్యూజిక్ డైరెక్టర్) డప్పులతో

 *ద* – *దగ్గరి* బంధువులను పిలిచి

 *ధ* – *ధ* నవంతులను కూడా పిలిచి

 *న* – *న* అనే నలుగురిని పిలిచి

 *ప* – *పది* మందిని పలకరిస్తూ

 *ఫ* – *ఫంక్షన్* కి రావాలని చెప్తూ

 *బ* – *బ* లగాలతో బంగార దుకాణాలకు వెళ్ళి

 *భ* – *భటువులని* (ఆభరణాలు) కొని

 *మ* – *మంగళ* స్నానాలు చేయించి, రాజసూయ

 *య* – *యాగం* లాంటి పెళ్ళికి 

 *ర* – *రా* రండోయ్ వేడుక చూద్దాం అని చెప్పి

 *ల* – *లక్షణమైన* 

 *వ* – *వధూవరులను* మీరు

 *శ* – *శతమానం* భవతి అని

 *ష* – *షరతులు* లేకుండా ఆశీర్వదించడానికి

 *స* – *సప్తపది* (పెళ్లి) వేడుకలో

 *హ* – *హంగు* ఆర్భాటాలతో రెడీ అయిన మండపంలో

 *ళ* – క *ళ* త్రం (భార్య) కాబోతున్న ఆమె ప్రక్కన వరుడు కూర్చొని

 *క్ష* – *క్షత్రియ* చెంత ఉండే బ్రాహ్మణుల సాక్షిగా జరిగే ఈ పెళ్ళి కి

 *ఱ* – *ఱరండి*

Related posts