telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

విలువైన కాలం…

విలువైన కాలంలో,
అమూల్యమైన సంతకాలన్నో ..!!
మనసును దోచుకున్న ,
మధురానుబూతులెన్నో..!!
గుండెకైన గాయాలకు ,
మౌనమే ఔషధమైన రోజులెన్నో..!!
కన్నీటి ప్రవాహానికి,
ఆనకట్టలు కట్టిన ఘడియ లెన్నో..!!
అంతులేని ఆనందానికి,
ఆకాశమే హద్దుగా భావించిన అనుభూతులెన్నో..!! బాధ్యతల బరువుతో ఉక్కిరి బిక్కిరవుతూ ,
సమస్యల సంపుటితో ,
కాలాన్ని లెక్కచేయక ,
పరుగిడిన వత్సరాలెన్నో..!!
విజయాన్ని సాధించాలని ఆశపడుతూ ,
కోల్పోయిన అభిరుచులెన్నో..!!
బంధాలు – బంధుత్వాల మధ్య సమన్వయాన్ని సాధించాలని తాపత్రయపడిన రోజులెన్నో..!!
ఆపదలో ఒక ఆపన్నహస్తం కోసం
ఎదురుచూస్తున్న సమయాన ,
నేనున్నాననే భరోసా కోసం ,
మనస్థాపంతో పరితపించిన రోజులెన్నో..!!
దృఢమైన మనసు , బలమైన సంకల్పమే ,
మనిషిని నిలబెట్టేవని తెలుసుకునేలా చేసి ,
నన్ను నన్నుగా నిలబెట్టిన కాలానికి ,
అన్యదా నమస్సుమాంజలి..!!!!

Related posts