telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఆగం అవుతున్న… బడిపంతులు బతుకు

ఏం బతుకులు మావి?

ఏం బతుకులు మావి?

బానిసలమా ? భావోధ్వేగాలు లేని జీవులమా?

బావి పౌరుల్ని తీర్చిదిద్దు ఉపాథ్యాయులం మేము

విలువలకు విలువలిచ్చి విలవిలలాడుతున్నాం

విధ్యార్థులు, విధ్యాసంస్థల నడుమ నలిగే అల్పమైన కీటకాలం

అర్థం లేని కర్తవ్యాన్ని భుజాన వేసుకుని, అధికులమని భావిస్తూ జీవిస్తున్నాం

వ్యవస్థలను, సంస్థలనూ నిలబెడుతూ బతుకులను మాత్రం కూల్చుకుంటున్నాం

ఉప్పు,పప్పు, పాలు, నీళ్ళూ, అద్దె, అన్నం

 అన్నీ భారాలే మా సగం జీతపు సంపూర్ణ జీవితాలకు

ఉపాధ్యాయ దినోత్సవం వెక్కిరింపుగా నవ్వుతోంది

” బ్రతకలేక బడిపంతులన్నది” పాతసామెత. “బడిపంతులుగా మాత్రం బ్రతకకన్నది” కొత్తసామెత.

ఇన్ని ఉన్నా మా పాఠాలాగవు… ఎందుకంటే మేమాశాజీవులం.

సరస్వతీపుతృలం

 

Related posts