telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ప్రకృతి-సమాజం

ప్రకృతి-సమాజం
ఎప్పుడూ ఒక్కటి కాదు
రెండూ కలగలిపి
గందరగోళపరచకుమిత్రమా
మేము స్పష్టంగానే ఉన్నాం
నీఅస్పష్టతలేక దు(స్ప)ష్టత
జనాన్నిఇబ్బందిపెడుతుంది
నువ్వు అంటావు-
సమాజంవెనక్కిపోతోందని
కాదు ముందుకే పోతోంది!
సైన్స్ విజయాలనుగుర్తించు
కొత్తసమస్యలొస్తాయా?
సమస్యలు లేని దెప్పుడు!
ముక్కుమూసుక్కూర్చుంటే
మహాఋషులంటావు!
భూత భవిష్య ద్వర్తమానా
లన్నీతెలుసంటావు-ప్రతి
సృష్టి చేసారంటావు!
అలాగైతే దేశం ఇలా
ఎందుకు తగులడింది?
కూడు లేని గూడు లేని
నిర్భాగ్యులెందుకున్నారు?
గుడులన్నీముష్టినిలయాలు
దారిద్ర్యలయాన్వితాలు!
కాలానికతీతులెవ్వరూలేరు
ప్రకృతి సృష్టి నీ దృష్టి!
సమాజ పుష్టి మా దృష్టి!
సర్వేజనా సుఖినోభవంతు
అన్న ప్రచారమే నీ తంతు-
సాధించటం మా వంతు
నువ్వుచెప్పేది అశాస్త్రీయం
మా ప్రయత్నం ‘శాస్త్రీయం’!

Related posts