telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

అమ్మ ఒక అద్భుతం, అద్వితీయం, అసమానం

అమ్మను ప్రేమకు ప్రతిరూపమని అనలేను
ఎందుకంటే ప్రేమకు వ్యతిరేక పదం ఉంది కాబట్టి
మమకారానికి మరురూపమనలేను

ఎందుకంటే మమకారానికి అనేక రూపాలున్నాయి కాబట్టి
అనురాగానికీ, ఆప్యాయతకీ సమతూకమనలేను

ఎందుకంటే అనురాగ, అప్యాయతలు చూపించే వారు అనేకం కాబట్టి
అమ్మను ఏ ఇతర పదంతోనూ సరిపోల్చలేము

ఎందుకంటే ఏ పదమూ అమ్మ అనే పదంతో సరి తూగదు కాబట్టి
అమ్మ ఒక అద్భుతం, అద్వితీయం, అసమానం
ఎందుకంటే అమ్మ అమ్మే కాబట్టి…

Related posts