telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

అమ్మా…. నువ్వు మళ్ళీ పుట్టాలి..

అమ్మా నువ్వు మళ్ళీ పుట్టాలి
మరుజన్మలోనూ మళ్ళీ నువ్వే
నను పెంచాలి …….
గోరుముద్దలే తినిపించాలీ
చందమామనే చూపించాలీ
నీలాలిపాటనే నే వినాలి
అఆ ఇఈ నేర్పాలీ
చెయ్యిపట్టి నడిపించాలి
నాతో నువ్వూ చదవాలీ
నాతోడుగ నువ్వుండాలీ
నను ప్రయొజకుణ్ణి చేయాలీ
నీ ఆయువు బాగుండాలీ
నీ ఒడిలోనే నే నిదురించాలీ
ఆ ఒడిలోనే నే కనుమూయాలి
నువ్వుండగనే నే వెళ్ళాలీ
చిరంజీవిగా సదా నువ్వుండాలి !
నీతో నా రుణం …..
ఎప్పటికి తీరాలీ?
అందుకే నా కలలకు
రెక్కలు రావాలి
నీ రెక్కలలో
నేనొదిగి “పోవాలి” !

Related posts