telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

లాలిపాట…

అమ్మ బొమ్మె
నవ్వి నప్పుడు నవ్వుతుా
ఏడ్చి నప్పుడు ఏడుస్తుా!…
కన్నుల్లో చెదరని కరుణం
నడకల్లో మయుారం
బిడ్డకై పాడేపాట నవరస భరితం
అయినా అమ్మ బొమ్మే…
తనకై దాచుకోని వ్యక్తిత్వం
ఎంత మంది బిడ్డలకైనా పంచే హృదయం
కాలే కడుపు తనదైనా నింపే చేయి తనదై
అయినా అమ్మ బొమ్మే….
ఊయలుాపు వడి
లాలిపాట తేనెలుాట
జోజోలు తనకు లేకపోయినా
పంచేది సంతానానికే
అయినా అమ్మ బొమ్మే…
మది గాంచలేరు
మాట వినలేరు
మమత పంచలేరు
మాసిన చీర…
రేగిన జుట్టు
నీకై వెతికే కళ్లు
ఆసరాలేని బ్రతుకులో
ఎదురీదే శక్తిమయం….
అయినా అమ్మ బొమ్మే
ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు
ఆడుకొంటుా…
అవును అమ్మ బొమ్మే
నాటికి నేటికి ఆట బొమ్మే అమ్మ!…

Related posts