telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

చిట్టి చిన్నారులు

అమ్మ గర్భాన్ని చీల్చి
పుడమి పైన అడుగెట్టిన
చిట్టి చిన్నారులు
ప్రతీ అమ్మకీ
దోసిట్లో చందమామలే…!!!
మీగడ తరకల్లాంటి మోము
ముగ్ధమనోహర రూపం
పాలు గారె బుగ్గలతో
చిరునవ్వు లు చిందిస్తూ
తన పురిటి నొప్పుల్ని
మరిచేలా చేసే చంటిపాపాయిలు…!!!
జాగ్రత్త అమ్మా
ముద్దులొలికే చిన్నారులని
కూడా చూడకుండా
మాటువేసి కాటువేసే
మాయదారి కేటుగాళ్లు ఎందరో ఉన్నారు
ఆ కేటుగాళ్ల చేతిలో
నీ జాబిలమ్మ చిక్కకుండా
రేయింబవళ్లూ కావలి కాయు…!!!
ఆదమరిచి ఉన్నావో
నీ పక్కనే పడుకున్న
నీ చందమామని
మాయం చేస్తారు
అల్లారు ముద్దుగా పెంచి
దోసిట్లో చందమామ లా
చూసుకున్న బంగారు తల్లులను
కాపాడుకునే బాధ్యత
నవమాసాలు మోసిన నీదే…!!!

Related posts