telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

డబ్బు అనే జబ్బుతో…బంధాలను చంపేస్తున్నాం

లోకజ్ఞానం మరిచి చదువుకి ప్రాధాన్యత ఇచ్చి
ఉత్తీర్ణత ద్రువపత్రం చూసుకుని మురిసి
జీవన అరణ్యంలోకి వచ్చి చూసి
మేము సాధించిన ధ్రువపత్రం
ఒట్టి చిత్తు కాగితం అని తెలిసి
అడ్డదారుల్లో ధనార్జన చేస్తూ
కోట్లు కోట్లు గడిస్తూ
క్షణం తీరిక లేకుండా
అయిన వాళ్లకి కూడా
కాస్తయినా సమయం కేటాయించక
ఆత్మీయ పలకరింపు కరువై
డబ్బుతో కూడుకున్న పలకరింపులు
స్వార్థంతో కూడుకున్న ఆప్యాయతలు
సహాయం చేసిన వారిని మరిచి
వాళ్లకి వెన్నుపోటు పొడిచి విర్రవీగుతూ
డబ్బే మన మూలధనం అని
వాళ్ళని వాళ్ళు మోసం చేసుకునే వాళ్ళు కొందరు
వాళ్ళని వాళ్ళు దిగజార్చు కొనే వాళ్ళు కొందరు
ఆరోగ్యాన్ని పణంగా పెట్టే వాళ్ళు కొందరు
డబ్బుతోనే స్నేహం చేసే వాళ్ళు కొందరు
అత్యంత దరిద్రం ఏంటి అంటే
కన్న తల్లిదండ్రులను
తోడబుట్టిన వాళ్ళని
మనల్ని నమ్మి ప్రేమించిన వాళ్లని
మనతో స్నేహం చేసే వాళ్ళని
ఈ డబ్బు అనే జబ్బుతో చంపేస్తున్నాం 

Related posts