telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఓ ప్రేయసి..ఉండిపో..నిండిపో

నాలో నీకోసం ఒక చిన్న తలంపు దాన్ని నువ్వు విశాలమైన మార్గంగా మర్చేసుకొన్నావు…

 

మన కోసం ఒక ఊహ

అంతే గొప్ప మాంత్రికుడిలా

నీ వసికరణతో నన్ను వశపరసుకొన్నావు…

 

ఇప్పుడు నువ్వంటే నాకు ఓ మత్తు

నా మనసు నీ చేతికిచ్చిన పూల గుత్తు

నీ చూపే నా జీవితానికి వెలుగునిచ్చే ఒత్తు

అలా కుదిర్చేసావు మరి నీతో నాకు పొత్తు…

 

నన్ను చూసావా… ? చూడు…

నాలోని అణువణువునూ చూడు

నీవు నాలో ఎక్కడలేవో చెప్పు

నీవు లేనిభాగం నాకెందుకూ…

ఆ భాగాన్ని ఖండించి దండించేస్తాను…

 

నీవో సౌందర్య పిపాసివి

నిత్య అన్వేషివి

నాలో నువ్వు స్థిర నివాసివి అయితే

నేనో ఆనంద పిపాసిని…

 

అందుకే నువ్వు కళ్ళు విప్పార్చుకొని

నన్ను నిలువెల్లా వెతుకుతావ్

నేను కళ్ళు మూసుకొనే

నిన్ను మనసారా ఆస్వాదిస్తాను…

 

ఉండిపో…

నా మత్తిష్కం నిండా నిండిపో

అక్కడే తాళం వేసుకొని ఉండిపో…

వేరే తలపులు నా లోనికి రానివ్వకుండా

నువ్వస్సలు బైటాకు పోలేకుండా…

 

నిండిపో…

నా గుండెల నిండా నిండిపో…

గుండె నాలుగు గదుల్లో నువ్వే ఉంటూ

ఏగది తలుపు తెరిచినా

నా మనసును ముచ్చట్లతో నింపేస్తూ…

నాలోకి ఆనందాన్ని ధారలు ధారలుగా ఒంపేస్తూ నాలో నిలువెల్లా నిండిపో….

 

 

Related posts