telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

సందేశం…

గాలితో కబురు పంపావా ?
చల్లగా తాకి నీ సందేశాన్ని వినిపించి వెళ్ళింది..
నీలి మబ్బుతో నీడను పంపావా ?
ఎండలో గొడుగులా మారి హాయిని నింపి వెళ్ళింది..
నిదురోతున్న వేళ చెవిలో గుసగుసల రాగం వినిపించావా ?
తన్మయత్వంతో మైమరచి పోయోలా చేసింది..
పూల సుగంధంలో నీ మనసును చూపించావా ?
ఆ సుగంథాల పరిమళాలకు మది పరవశించింది..
పూల మకరందంపై వాలే సీతాకోక చిలుకతో
నీ ప్రేమను పంపావా ?
నీవు లేవన్న భావన మరిచిపోయోలా చేసింది..
ఆకాశం నుండి వర్షించే చిరు జల్లులతో
నా మేనిని తాకి మురిసిపోయావా ?
హృదయమంతా నిండిన ప్రేమ, మేని
మొత్తాన్ని తడిపేసింది..
ఇంద్ర ధనుస్సులోని ఏడు రంగులూ నా మేని హొయలకు
కొత్త చీరగా కట్టి మైమరిచిపోయావా ?
ఆ చీరలో నా సొగసును చూసి ప్రకృతికి
ప్రకోపం వచ్చేలా చేసింది..
నా వెంటే నీడగా వస్తున్న నీకు బహుమతిగా నేనేమివ్వగలను?
నా చిరునవ్వును తప్పా …

Related posts