telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

హర హర శంభో శంకరా… 

బ్రహ్మ కోరాడని స్మశానంలో తిరుగుతాడు… 

ప్రేతాత్మలను ఆడిస్తాడు…

పుర్రెల మాలను అలంకరించుకుంటాడు…

ప్రళయ తాండవం చేస్తాడు…

బూడిదే ఇష్టమంటాడు ..

చిరుత తోలు చుట్టుకుంటాడు…

కంఠంలో గరళం దాచినవాడు…

కంఠమందు సర్పములను చుట్టుకున్నవాడు…

డమరుకం ఢమ ఢమ మ్రోగించిన వాడు..

త్రిశూలం చేబూని…

అరమోడ్పు కన్నులతో గమనించువాడు…

చంద్రున్ని సిగలో తురిమాడు….

గంగను జటాజూటంలో దాచిన వాడు…

దిగంబరుడు…

జంగమ వేషంలో సంచారం చేస్తాడు…

కపాలంలో బిక్ష చేస్తాడు…

ఆత్మ శుద్ధి వేడుకోమంటాడు….

లింగరూపంలో పూజలందుకుంటాడు…

కాసిన్ని జలం నిశ్చలమైన భక్తితో సమర్పించమంటాడు…

పత్రిదళాలతో పరవసిస్తాడు…

శ్వేత పుస్పాలతో అర్చించ మంటాడు…

ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓంనమః శివాయ అని పంచాక్షరీ మంత్రం జపిస్తే ప్రసన్నుడవుతాడు…

మూడు కన్నుల వాడు ముక్తినొసగువాడు..

భక్తి ముఖ్యం..

భక్తసులభుడువు నీవు శంకరా చిత్తాన తలిచిన చెంతనే చేరి కష్టాలు బాఫు తావు శంకరా…

నిన్ను మించిన దైవము లేదు శంకరా…

నిన్ను కొలువ నాకు మించిన దీనుడు లేడు శంకరా… ఆత్మలో లీనమై ఉంటావు…

లింగ రూపంలో పూజలందుకుంటావు శంకరా …

నీ లీలలు నేనేమని పలుకుదురా శంకరా…

శివ శంకర మహాదేవ హర హర శంభో శంకరా… 

Related posts