telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

పయనిస్తున్నా…!!

పుట్టిన స్థానానా చిరు జలాధారలతో మొదలయ్యే ను నేను…
నే వెళ్లిన దారంటా
వేవేల అనుభావాల మెలికలు ఎన్నెన్నో..!!
తప్పటడుగులతో చిరుప్రవాహిని గా మారి..!!
కొండల్లో కోనల్లో ఒంపుసొంపుల వయ్యారి నడకనై ..!!
ఎత్తు పల్లాల లో అణుకువతో ఒదిగిపోయే బుద్ధి మంతు రాలినై..!!
మైదానాలమట్టిని మమతానురాగాలతో పొదుపుకొని,పచ్చని పైరు పంటలను ప్రసాదిస్తూ..!!
వర్షపు చినుకును మెత్తని పొత్తిలినై హత్తుకుపోతూ..!!
నా గర్భంలోని సమస్త
మత్స్య సంపదకు ఆవాసమై..!!
సమస్త జీవులకు,భుక్తిని ముక్తిని,శాపవిముక్తినై..!!
సకల నాగరీకతలచరిత్రలకు ఆటపట్టునై..!!
ప్రతి జీవికి దాహార్తిని తీర్చుకొనేందుకు మంచి తీర్ధాన్నినేనై..!!
ప్రపంచమానవాళికిబుక్కెడు బువ్వముద్దకు ప్రాణాన్ని నేనై..!!
అశుద్ధాలకు, వ్యర్ధాలకు నిలయమై, రోగ గ్రస్తమై..!!
సరిహద్దుల ప్రాంతాల పంపకాల జలయుద్ధపు జగడాలనుచుస్తూ..!!
రసాయనకాలుష్యాలతో కలుషితమై మీకు ప్రమాదమై..!!
నిండు భారంతో భవిషత్ను అవలోకిస్తూ సముద్ర సంగమకై పయనిస్తున్నా…!!

Related posts