telugu navyamedia
culture news trending

చిరునవ్వుల వరమిస్తావా

చిరునవ్వుల వరమిస్తావా
చిరుగాలిలా వస్తాను
అనురాగం కురిపిస్తావా
చిరుజల్లులా చెంతకు వస్తాను
శ్వాసలా నాతో ఉంటావా
నీప్రాణమై నేనుంటాను
దేవతలా కరుణిస్తావా
మంచులా నీపాదాల చెంత కరిగి పోతాను
అమ్మలా ఆదరిస్తావా
అండగా నేనుంటాను
పసిపాపలా మురిపిస్తావా
పనివాడిలా పడిఉంటాను……
………………………………
సముద్రమంత లోతు ఆకాశమంత విశాలము ఈజీవితం
అయినా చాలదు కాలం తీరని కలలు అందని బంధాలు
కలవని స్నేహాలు మనసులోని అలజడులు ఆగని ఆలోచనలు
అంతా నాదే అన్ని నావే అనే బ్రమలు అపార్ధలతో అనుమానాలతో
అమయకంగా దూరమయ్యే అప్యాయతలు నిజమైన స్నేహం ప్రేమ ఒక వరం……

Related posts

బికినీతో బ్రిట్నీ ఫిట్‌నెస్ రొటీన్‌… వీడియో వైరల్

vimala p

విజయసాయిరెడ్డి చెత్త ఐడియాలతో.. జగన్ అమెరికా పర్యటన తుస్సుమంది: బుద్ధా వెంకన్న

vimala p

మా ఓటమికి కారణాలు .. చెప్పేసిన సిద్ద..

vimala p