telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

శుభరాత్రి.. మరువలేని జ్ఞాపకం

జ్ఞాపకాల ఊట

జీవితంతీపి చేదు కలయికలతో సాగే జీవనది..!!

ఎన్నెన్నో మలుపులు, ఎన్నెన్నో సుడిగుండాలు, అంతు చిక్కని అగాధాలు..!!

ప్రతి అనుభవం జ్ఞాపకంగా మారి మది భోషాణంలో నిక్షిప్తమైన వెలకట్టలేని అపురూప మేలిమి ముత్యమే..!!

అనుభవాలన్ని జ్ఞాపకాలపూదోటలో రంగు రంగుల సీతాకోకచిలుక లే..!!

ఎవరు లేని ఏకాంతానా మనసు పొరలలోని అరల్లో దాచిన చిత్రసమూహాలనుతరచి చూసుకొని గతంలోకితీసుకు వెళ్లేవే జ్ఞాపకాల సౌరభాలు …!!

 

కొన్నిఎదను తాకే మంచుపూల జల్లులే..

మరి కొన్నేమో వెన్నెలపూతల చల్లదనాల సమీరాలే..!!

 

ఇంకొన్నేమో పెదవoచున గుప్పున విరిసిన గులాబీల ఘుమ ఘుమలే…!!

 

 మనిషి గతమంతా జ్ఞాపకాల దొంతరలే తవ్వితే తరగని గనుల్లా..!!

 

మరచిపోని మదిలో నిరంతరం మెదిలే ఆనవాళ్లఅడుగులే జ్ఞాపకాలు..!!

  ప్రేమికులమనసుల్లోఅలసిపోనివాడిపోని నిత్యనూతన వ్యాపకమే జ్ఞాపకం…!!

జీవితoలోని మంచిచెడుల అనుభవసారాలే ఎండిపోని తేటఊటలే జ్ఞాపకాలధారలు..!!

Related posts