మన తప్పులు చూడం
ఎదుటి వారి తప్పులు వెతకటం
నిత్యం పని గా పెట్టుకుంటాం
మాయదారి లోకములో…
పక్కవాడి సంతోషం
మనసులో మొదలయ్యే వేదన
నిలువెల్లా కళ్ళు పెట్టి
వాడి మీదనే ప్రసరిస్తాం….
వేలెత్తి చూపడం
ఎదుటి వాన్ని కించపరచడం
అసత్యపు మాటలు సృష్టించి
సత్యహరిశ్చంద్ర వల్లించడం…
మనిషిపై పెంచుకుంటే కుళ్ళు
ఎదలో తయారవుతుంది ముళ్ళు
తొలిచి వేస్తుంది నిత్యం
తెలుసుకుంటే అదే సత్యం..
ఒక్క వేలు పక్క వాడిని చూపిస్తే
మిగతా వేళ్ళు నీ వైపే చూపే
నిన్ను నీవు తెలుసుకో
తప్పొప్పులు సరిదిద్దుకో..
నిందించడం పనిగా పెట్టుకుంటే
నీకంటూ తోడు ఉండరు
ఆప్యాయతతో ఆదరిస్తే
కడవరకు నిన్ను సాగనంపుతారు..
అంతరాత్మను పరిశీలించు
బయటి ప్రపంచాన్ని ప్రేమించు
పక్కవారిని దీవించు
ప్రతిరోజు సంతోషంగా జీవించు..
టీడీపీ ఎంపీల వ్యవహారంపై ఘాటుగా స్పందించిన చంద్రబాబు!