telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

జీవితమే నాటకం…!

ప్రకృతి సృష్టించిన వాతావరణంలో
మానవ జన్మ
ఖర్మల ఫలితమే !
జనించిన
మరణించక తప్పదు !!
జీవించే జీవితంలో
ఎదుర్కొనే
ఆరు ఋతువులలో
ఆరు రుచులు !
రుచులన్నీ రక రకాలు
ఋతువులు మారితే
రుచులు కూడా మారును !!
మానవ శ్రుష్టిలో
మనుషులు కూడా రక రకాలు !!
కామం తో కామాంధులు !
లోభం తో లోభిష్టులు !
మొహంతో మోహినీలు !
క్రోధంతో కోపిష్టులు !
మధం తో గర్విష్టులు !
మాత్సర్యం తో పిసిని వారు !
మలినాలు లేని
మానవుడే లేడు
లేవు !
అని చెప్పే మానవుడు
లేరు !
పాటిస్తే పతనానికి
అడుగులు !
కలియుగంలో
ఉన్నదంతా !
ఒకరి ధనం
ఇంకొకరికి ద్వేషం !
ఒకరి గర్వం
ఇంకొకరికి అహంకారం !
ఒకరి పర్వం
ఇంకొకరికి లోభం !
ఒకరి కాపీనం
ఇంకొకరికి లాభం !
ఒకరి మొహం
ఇంకొకరికి దాహం!
ఒకరి కోపం
ఇంకొకరికి ఆనందం !
ఇదే జీవితం …….
అరిషడ్వర్గాలని అరికట్టే
ఆరాధ్య దేవతలు లేరు !
పుణ్య పురుషులకు
పుట్ట గతులు లేవు !
జరుగుతూ
జరుపుకుంటూ పోతున్న
మానవ జీవితం !
అదే జీవితంలో
జీవిస్తున్న మనం
మానవులం !!
సాటి మానవులతో
ఆడుతున్న బూటకం !
ఈ జగతి ఒక నాటకం……….. !!!

Related posts