telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

న్యాయవాదులకే రక్షణ కరువు !

ఎటువెళ్తున్నాం మనం ..!
ఏమైంది మనుషులున్న మన సమాజం ..!
మనలో విజ్ఞానం పెరిగిందా !
మానవత్వం తరిగిందా !
రాక్షసత్వం ఆవహించిదా !
అజ్ఞానం అలుముకుందా !
ఒక కాకి కష్టంలో పది కాకులొకటయ్యేనే ..!
న్యాయవాదుల మరణంలో ప్రశ్నించే గొంతులే కరువయ్యేనే ..!
నేడు న్యాయం నడిరోడ్డులో వధ ..!
మరెందుకో ఎవరికీ పట్టదేమో ఈ వ్యధ ..!
పట్టపగలు ప్రజలందరి సమక్షాన
నల్లని కోటేమో ఎర్రటి రక్తపు మడుగయ్యే ..!
చట్టానికి చావు దిక్కయ్యే
న్యాయానికే న్యాయం కరువయ్యే ..!
కొన్ని వందల కళ్ల ముందే కత్తులతో దాడి ..!
కిమ్మనకుండా చూడటమే తప్ప ఆపలేరేమో ఎదురుపడి ..!
అందరూ ఆపాలనుకుంటే అదో పెద్ద లెక్కా ..!
ఆ మాకెందుకులే అనుకుంటాం కదా పక్కా ..!
న్యాయాన్ని కాపాడితే నోరెత్తకుండా చేస్తారా ..!
నిజాయితీగా ఉంటే నడి రోడ్డునే నరికేస్తారా ..!
న్యాయదేవత కళ్లకే గంతలు నోటికి కాదు !
న్యాయవాదులను చంపగలరేమో ..!
ప్రశ్నించే గొంతు నొక్కగలరేమో ..!
న్యాయమెప్పటికీ చావదు
ధర్మానిదే ఎప్పటికైనా గెలుపు
మేలుకోండి మనసున్న మనుజులారా ..!
మనమంతా మనుషులం
మనదంతా మానవకులం
మనం ఒకరికొకరం అవసరం
సానుభూతి స్పందనిప్పుడు అత్యవసరం ..!
న్యాయవాదుల రక్షణ కోరాలి ఈ సమాజం ..!

Related posts