telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

జ్ఞానం, విజ్ఞానం ఈ రెండిటికి తేడా ఏమిటి?

జ్ఞానేంద్రియాల ద్వారా మెదడుకు అందిన సమాచారాన్ని జ్ఞానం అంటారు. ఆ అందిన జ్ఞానాన్ని శాస్త్రీయదృక్పదం పద్దతిలో ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లు విడదీసి చూడడమే విజ్ఞానం అంటాం.. విజ్ఞానం కు,శాస్త్రీయం, నిజం,సత్యం,సైన్సు అనేవి పర్యాయపదాలు.

ఉదాహరణకు: మనం బస్సులో పోతున్నాం 60 స్పీడ్ లో బస్సు నడుస్తోంది రోడ్డుకిరువైపులా ఉన్న చెట్లు వెనక్కి పరిగేడుతున్నట్లు జ్ఞానేంద్రియాలు అయిన మన కళ్ళు తప్పు జ్ఞానాన్ని మెదడుకు చేరవేశాయి అది కరెక్టా?

కాదు చెట్లు అక్కడే ఉన్నాయి మనమే ముందుకు దూసుకు పోతున్నాం కదా అలాగే రోడ్డుపై ఎండమావులు అక్కడ నీళ్లు ఉన్నట్లు భ్రమింపజేస్తాయి కానీ ఉండవు ఇలా మన జ్ఞానేంద్రియాలు తప్పు జ్ఞానాన్ని అందిస్తాయి.

ప్రతి విషయాన్ని సరైన శాస్త్రీయ దృక్పధంతో పద్దతిలో వచ్చిన ఫలితాన్నే విజ్ఞానం అంటాము. అందుకే ఏ స్టేట్మెంట్ మనదగ్గరికి వచ్చినా శాస్త్రీయదృక్పదం తో ప్రాథమికంగా పరిశీలించకుండా స్వీకరించరాదు అని రాజ్యాంగాన్ని అనుసరించి శాస్త్రీయ దృష్టిని పరిశీలనా తత్వం, సంస్కరణాభిలాశ, మూర్తిమత్వం మానవీయతను పెంపొందించాలి.

Related posts