telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

నేను నడిచొచ్చిన దారే.. పూలబాట

అదిగో…
అది.. నేను నడిచొచ్చిన దారే..
అపుడు పచ్చటి మొక్కలతో..
పూల పరిమళాలతో..
ఉద్యానవనంలా భాసిల్లేది…
మదిని ఆహ్లాద పరిచేది…!
మరి..
ఇపుడేమయింది…
చెట్లు విలపిస్తున్నాయి..
పూవులు మాడి పోయాయి..
ఆకులు ఎండి నేలకు రాలిపోయాయి..!
అడుగడుగునా..
ఒక కన్నీటిబొట్టు పలకరిస్తోంది..
వేదన కాళ్ళకు అడ్డంపడి
దారిలో నడవనీయడం లేదు..!
ఇంతకీ ఏం జరిగింది..
అందరికీ ఇదే అనుభవమా….!
మోడుగా నిలిచిన ఆ దారిని..
మరలా.. జీవంతో నింపలేమా….!
చేయీచేయీ కలిపితే.. పచ్చదనాన్ని నాటితే..
ప్రపంచమే ‘పూలతోట’గా మారి..
నవ్వుతూ పలకరించదా…!
ప్రకృతి పరవశించి..
మనకోసం తీయనిపాటలు పాడదా…!
అందుకే.. రండి.. మనమే పచ్చనిమొక్కలమై..
ఆ దారిలో నిలబడదాం…!
పూవులమై విరబూసి పరిమళాలను వెదజల్లుదాం….!!

Related posts