telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఆకలి తీర్చే అన్నదాతలు…

దాత దైవం నీవే …………!
ఆకలి తీర్చే
అన్నదాతల పచ్చని పైరు
పలకరించింది !
వయ్యారంగా
వరిచేను వొంపు సొంపులతో
చూడ ముచ్చటగా
చూస్తు
నిలబడిపోయీ
మనసు కరిగిపోయింది !
మట్టి మనుషుల మాన్యానికి
కాపరిగ కాపల ఉండాలని
ప్రయత్నం చేయాలనిపించింది !
ఊహించినదానికంటే
ఉత్సాహంతో తిరిగి తిరిగి
తనివి తీరానంతవరకు
తిరుగుతూనే ఉన్నాను !
తల దాచుకునే చోటు దొరికితే
గుడారంలో గడిపి
గతిని గమనించలే !
సాయం సమయం వరకు
కోరికలతొ , కనువిందుతో
కళ్లు ముయకుండా
ముచ్చట్లలో మౌనాన్ని వహించి
పసిడి పంటలను శయన సోపానంగా
మార్చుకుని ఘాడ నిద్రలో నిసబ్ధం వహించి
నీడలో నిదురకు నిర్విఘ్నం కాకుండా
నిమఘ్నమైపోయాను !
కనిన కలల్లో
అనుభవం ఆరంభమై ఆశించినా
ఫలితం లెదు !
దుక్కితో దున్నే దైవం దాత
ధరణి పుత్రుడు దర్శనం లేక
విస్మయంతో వేనుతిరిగిపోయాను !
పసిడి భూమీలో పనిచేసే ప్రతి
అన్నదాతలతో
పెంచుకున్న ప్రేమగానే
మిగిలిపోయింది…….!

Related posts