telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఎప్పుడూ ఓటమి ఒప్పుకోవద్దురా….

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి

ఎప్పుడూ ఒదులుకొవద్దురా ఓరిమి

విశ్రమించవద్దు ఏక్షణం విస్మరించవద్దు నిర్ణయం

అప్పుడే నీజయం నిశ్చయం రా

ఎప్పుడూ ఒప్పుకొవద్దురా ఓటమి

నింగి ఎంత పెద్దదైన రివ్వుమన్న గువ్వపిల్ల

రెక్కముందు తక్కువేనురా

నింగి ఎంత పెద్దదైన రివ్వుమన్న గువ్వపిల్ల

రెక్కముందు తకువేనురా

సంద్రమెంత గొప్పదైన ఈదుతున్న చేపపిల్ల

మొప్పముందు చిన్నదేనురా

పశ్చిమాన పొంచి ఉండి రవిని మింగు

అసుర సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా

గుటకపడని అగ్గిఉండ సాగరాలనీదుకుంటు

తూరుపింట తేలుతుందిరా

నిశావిలాసమెంతసేపురా

ఉషోదయాన్ని ఎవ్వడాపురా

రగులుతున్న గుండె కూడ

అగ్నిగోళమంటిదేనురా

ఎప్పుడూ ఒప్పుకొవద్దురా ఓటమి

 

నొప్పిలేని నిమిషమేది జననమైన మరణమైన

జీవితాన అడుగు అడుగునా

నీరసించి నిలిచిపోతె నిమిషమైన నీది కాదు

బ్రతుకు అంటె నిత్య ఘర్షణ

దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది

ఇంతకన్న సైన్యముండునా

దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది

ఇంతకన్న సైన్యముండునా

 

ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను

ఆశయంబు సారథౌనురా

నిరంతరం ప్రయత్నమున్నదా

నిరాశకే నిరాశ పుట్టదా

ఆయువంటు ఉన్న వరకు చావు కూడ నెగ్గలేక

శవముపైనె గెలుపు చాటురా

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి

 

 

Related posts