telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

కలలు కనే కళ్ళు… ఖర్చు లేని కోరికలు

జీవితమొక రంగుల కల

కలలు కనని మనిషి జగాన లేడేమో

కలలు మనిషి అంతః చేతనల ఆస్పష్ట రూపాలకు దర్శనాలు

కన్నెపిల్ల కలలువిప్పారిన కలువల అందాలే

కోటి కలల కళల వాకిళ్ళు ఆకనులు

నిరాశ నిస్పృహలలోకి కొన్ని కళ్ళను కలలు ఎప్పుడూ నెట్టేస్తుంటాయి

జీవితంలో అలసిపోయి కొందరు కన్న కలలను కలగానే చూసి వదిలేస్తుంటారు

కలే జీవితాశయం అయినరోజుననిదురలో కన్న కలను వాస్తవం లో నిజం చేసుకున్నట్టే

 

కలలు మనిషిజీవితాన్ని ప్రభావితం చేసే అద్భుతాలు

 

 కలల సాకారం కై కష్ట పడని మానవుడు ఇలలో లేడు

 

కమ్మని కలల విహారంలో నిరంతరo సంచరించే కలల బేహారులు ఎందరో

 

కలలు కనే కళ్ళు అందరికి ఉంటాయి కానీ అవి నిజం చేసుకున్న కళ్ళు కొందరికే ఉంటాయి సుమా..

 

ఉట్టి కలలు కంటూ కూర్చుంటే కల్లలై పగటి కలలుగా నే మిగులుతాయి

 

నిదురలో, వాస్తవంలో మనల్ని వెంటాడిన కలను కలగా మిగిలిపోనివ్వక 

 

నిజం చేసుకున్నప్పుడేఆ కలకు సార్ధకత ఆకళ్లకు నిండుదనపు ఆనందం..

 

 

Related posts