telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

భువిలో వెలసిన దేవతలే వైద్యులు 

doctor medical

వైద్యో నారాయణో హరిః

“వైద్యమనేది భగవత్సంకల్పం”

వైద్యుడు ఒక మార్గదర్శి ,

ఆచరించ క్రమశిక్షణ పాఠమై..

వైద్యుడు ఒక మిత్రుడు,

రోగిబాధను పంచుకునే భరోసాయై.

వైద్యుడు ఒక శ్రేయోభిలాషి….

 

నిత్యం రోగి క్షేమం కాంక్షిస్తుా.

వైద్యుడు ఒక ప్రాణ రక్షకుడు,

 శక్తినంత ధారబోసి ప్రాణంపోస్తుా..

వైద్యుడు పునర్జన్మను ప్రసాదించే

 దైవస్వరుాపమే భువిలో….

 

జబ్బును మాత్రమే గాంచి

నిత్యం రోగాలతో పోరాడే యెాధుడు,

రిోగాల సమరంలో కొన్నిసార్లు విజయం సాధిస్తుా,

మరికొన్ని సార్లు ఓటమిని చవిచుాస్తుా,

గెలుపులో పొంగిపోక

ఓటమిలో కృంగిపోక,

మరో యుధ్ధానికై సిద్దమవుతుా….

నిస్వార్ధ సేవకే అంకితమవుతున్న వీరుడే వైద్యుడు …

 

ప్రపంచం తల్లడిల్లుతున్నా,

వైరస్ పెనుభుాతమై అల్లుకుంటున్నా,

ధైర్యము వీడని ధీరుడే వైద్యుడు.

కాచుతున్నారు పోరాడుతున్నారు

ప్రాణాలను నిలపాలని 

 తమదైన త్యాగం గెలవాలని….

 

హారతి కర్పుారాలై కరుగుతుా,

సేవ సుగంధాలు నింపుతుా,

రోగాలను తరిమికొడుతుా,

నిత్యసేవలో తరిస్తుా,

నీరుగారిపోతున్న ప్రాణాలను

నిలువరిస్తుా…..

 

కుటుంబ ప్రేమలకు దుారమవుతుా,

తమకంటుా రక్షణ కరువైపోతుా,

విజయాల మెప్పులు గాంచుతుా,

ఓటమి దెబ్బలకు ఎదురీదుతుా,

అర్ధం చేసుకోని సమాజం వైపు ఆర్తిగా చుాస్తుా,

కదులుతున్నారు వైద్యులు….

 

నేడు వైద్యులకిచ్చే భరోసా కరువై

తమ చేతుల్లో లేని మృత్యుపోరాటంలో 

సమిధలవుతుా,

వేదనలో మునుగుతుా

అవగాహన లేని ఆవేశాలకు 

బలైపోతున్నారు వైద్యులు…

 

తాము మనుషులమనే ప్రాధేయపడే జీవితాలై

నిత్యం మనసు సంఘర్షణలతో

కొట్టు మిట్టాడుతున్నారు వైద్యులు 

ప్రతి ఒక్కరి బాధ్యతగా అందివ్వాలి చేయూత

మేమున్నామనే ఓదార్పు మాట భరోసా,

 

ప్రతిఫలం ఆశించని ప్రేమలే పంచుతుా

భువిలో వెలసిన దేవతలే వైద్యులు 

Related posts