telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ప్రజాస్వామ్యం

ప్రజాస్వామ్యం పగలు పుడుతోంది
సాయంత్రానికి చస్తోంది
స్వాతంత్రం అర్ధరాత్రి పుట్టి
అర్ధరాత్రే చస్తోంది
నియంతలే పాలకులవుతున్నారు
రాజ్యమంతా హింసరేపుతున్నారు
శాంతి కుత్తుక కోసి, అహింసను మట్టుబెట్టి
అమాయకులను ఉద్యమాల పేరిట బలిచేస్తున్నారు
కట్టుకున్న వారి నల్లపూసలతో
దేశాజెండాకి నల్లరంగులు అద్దుతున్నారు
జననీ జన్మభూమిశ్చహః…..
భారతదేశం నా మాతృభూమి
భారతీయులందరు నా సోదర
సోదరీమణులన్న ప్రతిజ్ఞలు
వీధి వీధికి చెరబట్టిన దుస్సాసనులు
ఇంటి ఇంటికి భంగపడ్డ సీతలు
జననీ జన్మభూమిశ్చహః…..
యువ రక్తాల్లో పురుడుపోసుకుంటున్న కొత్తలోకాలు
అమృతధారలా పొంగుతున్న నిధుల నదులు
లేని వాడి గొంతుదాకా చేర్చాలంటే
వాటిపక్క పారక తప్పని నెత్తుటి వాగులు
జననీ జన్మభూమిశ్చహః…..
మైరాశ్చం నిర్వేదం నిండిన నిరుద్యోగులు
రాజకీయ చట్రంలో పావులైన వెర్రి పౌరులు
జన్మభూమిని సేవించే రామయ్యలు
అడువులపాలు రాళ్లపాలు
జననీ జన్మభూమిశ్చహః…..
వృత్తికొక కులాన్ని అంటకట్టి
కాళ్ళకింద తొక్కిపెట్టి
అంటరాని వాళ్ళని వెలేస్తుంటే
నా జన్మభూమిలో ఎక్కడుంది
సాంఘిక సమానత్వం….
ఎక్కడుంది….??
ఈ సమానత్వం కోసమే
సమ సమాజాన్ని సాధించడం కోసమే
పేదవాడికి పట్టాభిషేకం కట్టడం కోసమే
నాటి నుండి నేటి దాకా
దేశాన్ని బతికించడం కోసం
చరిత్రలో ఎంతమంది వీరులు నెలకొరిగారో
ఆ తల్లుల కన్నీటికి మంటలు కాస్తయినా
దేశానికి వెలుగునింపలేకపోయాయి
ఆ వీరుల త్యాగాలు వృధాఅయ్యాయి
తెగిన ఆవీరుల మొండాలను వెతుక్కుంటూ
తన బిడ్డల త్యాగాలను చూసి ఏడ్చుకుంటూ
భారతమాత ఇంకా చీకట్లోనే ఉంది
జననీ జన్మభూమిశ్చహః…..

Related posts