telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

కానరాని బంధాలు : కరోనా తెచ్చిన చావులు

భయం భయం భయం

వెంటాడుతున్న భయం 

కాలం కర్కశమై కన్నెర్రచేస్తుంటే

పకృతి ప్రళయం సృష్టిస్తుంటే 

అనుక్షణం భయం భయం

 

ప్రపంచానికి తెగులొచ్చింది

కరోనా మహమ్మారి కాచుక్కూర్చుంది

దాన్నుంచి ఎక్కడికి పారిపోవాలి.

ఏ పాతాళంలోకి జారిపోవాలి

వెళ్ళినా తప్పించుకోగలమా!

వెంటాడుతున్న భయాన్ని దూరం చేయగలమా!

 

కుటుంబానికి భద్రత లేదు

ప్రాణానికి భరోసా లేదు

ఎటు చూసినా కంటికి కానరాని వైరెస్సే

ఘడియ ఘడియకు చావువార్తలే

 

ఆ చితిమంటల వేడికి

భూగోళం ఆవిరవుతోంది

వల్లకాడు భోరుమంటూ 

వెక్కి వెక్కి ఏడుస్తుంది.

 

కాటికాపరి పెద్దకొడుకై

చితికి నిప్పంటిస్తున్నాడు 

బంధాలు ఆవిరవుతుంటే

అతడే బంధువవుతున్నాడు..

 

కనపడని నిశ్శబ్దంతో 

శ్మశానం వెక్కిరిస్తోంది

ఏరి నీ బందుగణమని 

డప్పుల మోతలు,బాంబుల శబ్దాలు

వినపడవే

నిన్ను ఊరేగిస్తూ తీసుకొచ్చే 

జనం కనపడరే..

 

ఇప్పుడా

పక్కింటి వారి పలకరింపులు

పొరింగింటివారి పరామర్శలు 

ఏమయ్యాయో ఎటుపోయాయో….

కనిపించని మహమ్మరికి దాసోహమయ్యేనేమో

 

 

Related posts