telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఆ నలుగురు మోయలేని…చావుపల్లకీలు

ఆ నలుగురు మోయలేకపోతున్నారు.
ఇంటి ఇంటా ఇంటూ కిరణాలని,

వంటిలో జొప్పించుకుంటున్నారు…..

ప్రతి గుండెకు ఉక్కపోత ఎక్కువయ్యింది.!

గాలిసోకి గాలి వదలడమౌతోంది..

చావు మేళపు శబ్దాలు లేవు..

మోసుకువెళ్లలేని వైరాగ్యలే అన్ని…!!

 

పేరుపు ఏడుపులు లేవు…?

ముందు వెదజల్లే పేలాలు లేవు..!

గణము గుంపుగా వెనుకరాదు…

బంధు గుణము దరిచేరరు…

ఆకాశంలో మబ్బుల్లాగా,

అభద్రతాభావం అవని అంతటా ఉంది..

 

మృతదేహాలకి కుట్లు కోతలు లేవు..*

చావుపల్లకీలకు కట్లు కర్రలు లేవు..*

ఆదరణలేదు అండదండలు లేవు..!*

ఇప్పుడు కాలసర్పదోషాలు లేవు…!*

కన్నీటి చుక్కలతో ఆవిరిపడుతున్నారు.!

కరోన సర్పలే వీధుల్లో తిరుగున్నాయి..

 

హితులు దగ్గరకు రారు….??*

పురోహితులు పిండాలు పెట్టరు..

యముడు వీధుల్లో తిరుగున్నాడు..!

చిత్రగుప్తుడు ముసలివాడైయ్యాడు..!!

విధాతకు పూజలెక్కువయ్యాయి…***

విశ్వమంతట శ్మశానం కనబడుతోంది..

 

బీదవాడికి ఆకలి చచ్చింది….!!

వైద్యులు వారు నోట్లు తింటున్నారు..??

రాళ్ళ బొమ్మలకు కోట్లఖర్చులు..

ఆయువుకు వాయువు కరువు…!!

మంత్రాలుకు చింతకాయలు రాలుతున్నాయి.

కర్మభూమిలో క్రియానుసారం,

పాలకులు చావుపల్లకీలు చేస్తున్నారు…

వారు మోయరు దగ్గరికి ఎవరురారు….

 

                      

Related posts