telugu navyamedia
news Technology

నిన్న ఫేస్ బుక్.. నేడు కోరా … హ్యాకింగ్ … వారే టార్గెట్…

quora hacked

ఇటీవల సామజిక మాధ్యమాలలో ప్రజలు ఎక్కువగా ఉండటం గమనించడం జరిగిందేమో… దానికి తగ్గట్టుగానే టెక్నాలజీ లో లొసుగులు పట్టుకొని నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. నిన్న ఫేస్ బుక్ వాడుతున్న వారి వ్యక్తిగత విషయాలను హ్యాకింగ్, తదితర విషయాలతో బహిర్గతం చేశారు. అయితే నేడు మరో సామజిక మాధ్యమం కోరా ను వాడుతున్న వారి అకౌంట్ లు హ్యాకింగ్ అయినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్నీ సదరు వెబ్ సైట్ అధికారికంగా ధ్రువీకరించింది. తమ వెబ్ సైట్ లో రిజిస్టర్ అయినా వారి అకౌంట్ లు హ్యాక్ అయ్యాయని, ఆ సమాచారాన్ని వారు దొంగిలించారని కోరా ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ ఘటనపై సంస్థ విచారణ చేస్తున్నట్టు తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపడుతున్నట్టు వారు హామీ ఇచ్చారు. గతనెల 30న ఒక థర్డ్ పార్టీ కి చెందిన ఒక సంస్థ కు చెందిన హ్యాకర్ లు కోరా కంప్యూటర్ లలోకి అక్రమంగా ప్రవేశించి సమాచారాన్ని దొంగిలించినట్టు వారు తెలుపుతున్నారు. ఈ ఘటనకు కోరా కారణాలు అన్వేషిస్తుంది. దీనిపై ఇప్పటికే నేర విచారణా అధికారులకు పిర్యాదు చేసినట్టు తెలిపింది. మొత్తం 100 మిలియన్ ల కోరా అకౌంట్ లు హ్యాక్ అయినట్టు ప్రాథమిక సమాచారం ద్వారా వెల్లడించారు. ఆయా యూజర్ల పేర్లు, ఈమెయిలు అకౌంట్లు, పాస్ వార్డ్ లు, ఇతర సమాచారం.. దొంగిలించినట్టు తెలిపారు. కోరా యూసర్ లు తమ పాస్ వార్డ్ లను మార్చుకోవాలని సంస్థ సూచించింది.

Related posts

చంద్రబాబును ఆంధ్రా సెట్లెర్స్ కూడా నమ్మట్లేదు: జీవీఎల్

vimala p

సెక్స్ లో కంటే హస్త ప్రయోగంలోనే ఎక్కువ సంతృప్తి ఉంటుందా?

ashok

నా మొదటి ఓటు మానాన్నకే వేసే అవకాశం..

vimala p