telugu navyamedia
రాజకీయ

బ్రిట‌న్ రాణి ఎలిజ‌బెత్-2 మృతి ..

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 2 గురువారం క‌న్నుముశారు. గ‌త కొంత‌కాలంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న క్వీన్ ఎలిజబెత్ 2 (96) గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. 

బ్రిటన్‌ను దీర్ఘకాలం పాలించిన రాణిగా తన పేరును రికార్డుల్లో సుస్థిరం చేసుకున్నారు. ఆమె దాదాపు 70 సంవత్సరాల పాటు బ్రిటన్ కు రాణిగా ఉన్నారు.

బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ 2 మరణించినట్టు బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటించింది. బల్మోరల్ ఎస్టేట్‌లో ఆమె గురువారం మధ్యాహ్నం కన్నుమూసినట్టు వివరించింది.

రాజ కుటుంబ సభ్యులు…  క్వీన్స్ కుమారుడు, వారసుడు ప్రిన్స్ చార్లెస్, మనవలు విలియం మరియు హ్యారీ, వారి కుటుంబాలు – స్కాటిష్ హైలాండ్స్‌లోని ఆమె బాల్మోరల్ రిట్రీట్ వద్ద కు వచ్చి చేరుకున్నారు.

17 Things That Will Happen When Queen Elizabeth Dies – SheKnows

గురువారం మధ్యాహ్నం ఆమె అనారోగ్యం పాలైనట్లు వార్తలు వెలువడ్డాయి. ఆ తర్వాత ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉంది. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో రాణి మనవడు ప్రిన్స్ విలియం కూడా ఆమెతో ఉన్నారు.

అనారోగ్యం కారణంగా, రాణి బల్మోరల్ ప్యాలెస్‌లో నివసిస్తున్నారు. ఆమె ఈ రాజభవనం నుంచి అధికారిక పనులన్నీ చేసేది. బ్రిటన్ కొత్త ప్రధాని లిజ్ ట్రస్ సెప్టెంబర్ 6న ఇక్కడికి వచ్చి ఆమెను కలుసుకుని ప్రమాణ స్వీకారం చేశారు.

After 70 years, Queen Elizabeth II is Loved. The Monarchy, Not So Much - News @ Northeastern

రాణి ఎలిజ‌బెత్-2 మరణంపై బ్రిట‌న్ ప్ర‌ధాని లిజ్ ట్ర‌స్‌ సంతాపం తెలిపారు. ఆమె మృతి సంద‌ర్భంగా బ్రిట‌న్ ప్ర‌భుత్వం 10 రోజుల సంతాప దినాలు ప్ర‌క‌టించింది.

Image

 

Related posts