telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

క్యూ-నెట్ పేరుతో… 3వేల కోట్ల కుచ్చు టోపీ… 15మంది అదుపులో…

q net scam of 3000 crores

మల్టీలెవల్ మార్కెటింగ్ ద్వారా నష్టపోతున్న వారు ఎందరో ఉన్నారు. దీనిపై ఎప్పుడు ఇలాంటి వార్తలు వింటూనే ఉన్నాకూడా, ఆయా వ్యక్తులు చెప్పే మాయమాటలకు చలించి పోయి, ఎంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్మును మల్టీలెవల్ మార్కెటింగ్ అంటూ పెట్టి తీవ్రంగా నష్టపోతున్నారు. తాజాగా మరో స్కాం, 3000 కోట్లుగా తేల్చారు అధికారులు. దీనిపై విచారణ జరిపిన అధికారులు 15మందిని అదుపులోకి తీసుకున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా వేలమంది ఈ స్కాం బాధితులుగా తెలుస్తుంది. క్యూ-నెట్ పేరుతో 3000 కోట్లు కొల్లగొట్టారు దుండగులు. ఇదంతా మల్టీలెవల్ మార్కెటింగ్ మీదనే జరిగిపోయింది. ఈ సంస్థను బ్యాన్ చేయాలనీ బాధితులు కొన్నాళ్లుగా నిరసనలు వ్యక్తం చేస్తుండటంతో రంగంలోకి దిగిన అధికారగణం స్కాం గా తేల్చారు.

Related posts