telugu navyamedia
రాజకీయ సినిమా వార్తలు

“పి.వి. నరసింహారావు- ఛేంజ్‌ విత్‌ కంటిన్యుటీ” ట్రైలర్

PV NARASIMHA RAO,Change With Continuity Trailer

అపర చాణిక్యుడు, నూతన ఆర్ధిక సంస్కరణల పితామహుడు పీవీ నరసింహారావు భారతదేశ చరిత్రను ఒక మలుపు తిప్పారు. ఆయన గురించి భారత జాతి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పీవీ నరసింహారావు సుప్రసిద్ధ సాహితీవేత్త. విశ్వనాథ సత్యనారాయణ రాసిన “వేయి పడగలు” నవలను “సహస్రఫణ్” పేరుతో హిందీలోకి అనువదించారు. అంతేకాదు ఆయన జీవితంలోని రాజకీయ పార్శ్వాలను “ఇన్ సైడర్” (లోపలి మనిషి) పేరుతో ప్రచురించారు. తాజాగా ఆయన జీవితం ఆధారంగా “పి.వి. నరసింహారావు- ఛేంజ్‌ విత్‌ కంటిన్యుటీ” పేరుతో ఒక డాక్యుమెంటరీ నిర్మితమవుతోంది. ఇప్పుడు ఈ డాక్యూమెంటరీకి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ను మీరు కూడా వీక్షించండి.

ఈ ట్రైలర్ లో నరసింహారావు గొప్ప నాయకుడని, ప్రజల కోసం కఠినమైన నిర్ణయాలను తీసుకున్నారని, 1991లో ఆయన చేసిన ఆర్ధిక సంస్కరణలు దేశ అభివృద్ధిలో కీలకపాత్రను పోషించాయని ఆయనతో కలిసి పనిచేసిన నాయకులు, ఆయన స్నేహితులు, పలువురు జర్నలిస్టులు వివరించారు. జూన్ లో పూర్తి డాక్యుమెంటరీని విడుదల చేయనున్నారు.

Related posts