telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

పుష్ప సినిమాలో విలన్ అతడేనా…?

Pushpa

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో రంగస్థలం సినిమాతో దర్శకుడు సుకుమార్ స్టార్ డైరెక్టర్‌గా నిలిచాడు. ప్రస్తుతం బన్నీ, సుకుమార్ కాంబోలో వస్తున్న తొలి సినిమా పుష్ప. వీరి కెరీర్‌లో పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్న తొలి చిత్రం కూడా ఇదే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు షెడ్యూళ్లు కూడా పూర్తి చేసుకున్నారు. మూడో షెడ్యూల్ వాయిదా పడటంతో దాన్ని పూర్తి చేసేందుకు వారు రాజమెండ్రి మారేడు మిల్లి అడవుల్లో ఉన్నారు. ఈ షెడ్యూల్ పూర్తయ్యేసరికి సగం సినిమా పూర్తవుతుందట. అయితే దాదాపు సగం పూర్తయినా ఇందులో విలన్ మాత్రం ఇంకా ఫిక్స్ అవ్వలేదు. ఇంటర్వెల్ వద్దే విలన్ పరిచయం ఉంటుందట. దాంతో ఇప్పటిదాకా ఈ పాత్ర ఎవరు చేస్తారన్న దానిపై దృష్టిపెట్టలేదట. ఇప్పటి వరకు పుష్ప విలన్ పాత్రలో ఎవరు చేస్తారన్న దానిపై అనేక పేర్లు వినిపించాయి. విజయ్ సేతుపతి, బాబీ సింహా, అరవింద్ స్వామి, ఆర్య ఇలా ఎన్నో పేర్లు వినిపించాయి. మళ్ళీ ఇప్పుడు బాలీవుడ్ హీరో బాబీ దేవల్ పేరు వచ్చింది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి హిందీ నటుడు ఉంటే అటు మార్కెట్ పెరుగుతుందని అతడి పేరు వచ్చింది. అంతేకాకుండా పెద్ద స్ఠార్లయితే బన్నీని డామినేట్ చేస్తారని, అందుకే మీడియం రేండ్ విలన్‌ అయితే బాగుంటుందని భావిస్తున్నారట. మరి ఈ సినిమా ఎప్పటికి విడుదల అవుతుంది అనేది చూడాలి.

Related posts