telugu navyamedia
news telugu cinema news

పుష్ప టీజర్ వచ్చేది ఎప్పుడంటే..?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అందరికీ సుపరిచితమే. ఎప్పటికప్పుడు కొత్త తరహా కథలతో ప్రేక్షకులను అరిస్తారు. అయితే తాజాగా అర్జున్ చేస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాను స్టార్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో లక్కీ బ్యూటీ రష్మికా హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా నుండి ఇప్పటివరకు పోస్టర్లు తప్ప మారె అప్డేట్ రాలేదు. అయితే త్వరలోనే ఈ సినిమా టీజర్ విడుదల చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా టీజర్‌ను బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్8న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. అయితే ఈ సినిమా ఇంకా 70శాతం చిత్రీకరణ జరుపుకోవాల్సి ఉంది. అందుకోసం అర్జున్ పని రాక్షసుడిలా చేస్తున్నారంట. ఏ సన్ని వేశంలోనూ డూప్‌ను వాడకుండా తానే చేస్తున్నారంట. ఈ సినిమాను కుదిరినంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు. అయితే ఈ సినిమాను ఆగస్ట్13న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు ఎంతలా క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.

Related posts

సీఎం కేసీఆర్‌కు రోజా ఘనస్వాగతం

vimala p

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రణబ్ ఎంతో కృషి: కేసీఆర్

vimala p

ఆ జీవోను చంద్రబాబు పూర్తిగా చదివారా..?: జగన్ తీవ్రవ్యాఖ్యలు

vimala p