telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇస్మార్ట్ శంకర్ కోసం.. ఖతర్నాక్ ఐటం సాంగ్.. పూరి మార్క్..

puri mark mass song in ismart saknar movie

దర్శకుడు పూరి జగన్నాథ్ చిత్రం అనగానే అందులో ఖతర్నాక్ ఐటం సాంగ్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఆ సాంగ్ కోసం ఆయన ప్రత్యేకంగా ఒక నటిని ఎంచుకొని, తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తూనే ఉంటాడు. అది ఆయన మార్క్ గా మిగిలిపోయింది. ఇప్పుడు రామ్ హీరోగా ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాను రూపొందిస్తున్నాడు పూరి. ఈ సినిమాలో రామ్ రఫ్ లుక్ తో కనిపిస్తూ .. మాస్ ఆడియన్స్ లో ఆసక్తిని రేపుతున్నాడు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, చకచకా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు. గతంలో పూరి – మణిశర్మ కాంబినేషన్లో వచ్చిన ‘పోకిరి’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమాలో ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే .. ‘అంటూ సాగిన ఐటమ్ సాంగ్ ఇప్పటికీ కుర్రాళ్ల గుండెల్లో సందడి చేస్తూనే ఉంది. ఆ ఐటమ్ సాంగ్ కి మించిన ట్యూన్ చేయమని పూరి చెప్పడంతో .. మణిశర్మ ఆ పనిని పూర్తిచేశాడని అంటున్నారు. త్వరలోనే ‘నోరా ఫతేహి’పై ఈ ఐటమ్ సాంగ్ ను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి పోకిరి సిరీస్ తీస్తున్నట్టున్నాడు పూరి. ఈ చిత్రం కూడా అంతటి విజయాన్ని రామ్ కి తెచ్చిపెట్టనుందా.. చూడాల్సి ఉంది.

Related posts