telugu navyamedia
సామాజిక

ఇవాళ పూరీ జ‌గన్నాధుడి ర‌థ‌యాత్ర..జ‌గ‌న్నాథ‌, బ‌ల‌భ‌ద్ర‌, సుభ‌ద్ర ర‌ధాలు రెడీ

*ఒడిశాలో వైభవంగా పూరీ జగన్నాథుని రథయాత్ర
*భ‌క్త జ‌న‌సంద్రంగా మారిన పూరి..
*జ‌గ‌న్నాథ‌, బ‌ల‌భ‌ద్ర‌, సుభ‌ద్ర ర‌ధాలు రెడీ
*రెండేళ్ల త‌రువాత భ‌క్తుల‌కు అనుమ‌తి

భువ‌నేశ్వ‌ర్‌: ఒడిశాలో ప‌విత్ర పుణ్య‌క్షేత్రం పూరీ జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర నేడు వైభ‌వంగా మొద‌లైంది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో రెండేళ్ల తర్వాత ఈసారి రథయాత్రలో భక్తుల అనుమతించారు.

దీంతో ఈ ర‌థ‌యాత్ర‌లో పాల్గొన‌డానికి దేశ‌విదేశాల నుంచి భారీ సంఖ్య‌లో భ‌క్తులు వ‌చ్చారు. పూరి నగరం లక్షలాది మంది భక్తులతో జనసంద్రాన్ని తలపిస్తోంది. ఈసారి యాత్రకు 15 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. 

ఈ పండుగ ప్ర‌తి సంవ‌త్స‌రం జూన్ లేదా జూలై నెల‌ల్లో ఆషాడ‌మాసంలో వ‌చ్చేశుక్ల‌ప‌క్షం రెండ‌వ రోజున జ‌రుగుతుంది. ఈ సంవ‌త్స‌రం ఉత్సవం జూలై 1న వ‌చ్చింది. ఈ యాత్ర తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది.

జ‌గ‌న్నాథుడి ర‌థ‌యాత్ర‌ను ప్రారంభించే ముందు..సాంప్ర‌దాయ ఆచారాల‌ను పాటించారు. అనంత‌రం జ‌గ‌న్నాథుడు, దేవి సుభ‌ద్ర , బ‌ల‌రాముడుకి చెందిన మూడు ర‌థాల‌ను గురువారం ఆల‌యం సింహ‌ద్వారం ముందు ఉంచారు.

ఈ ర‌థ‌యాత్ర ఉత్స‌వాల‌కు వ‌చ్చే జ‌నాన్ని దృష్టిలో ఉంచుకుని ఒడిశా పోలీసులు భారీ భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు.

 

Related posts