telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇష్టం ఉన్నా లేకపోయినా భార్య చెప్పింది చచ్చినట్లు వినండి : పూరి జగన్నాథ్

Puri

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వరుసపెట్టి పోడ్ కాస్ట్ ఆడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఈ ఆడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆలుమగల బంధంపై ఆయన స్పందిస్తూ ఆడాళ్లు, మగాళ్లు ఒక జాతి కాదనే సందేశమిచ్చారు. ఒక బుక్‌లో మగవారు అంగారక గ్రహానికి, స్త్రీలు శుక్ర గ్రహానికి చెందినవారు అని రాసి ఉంది. ఆడాళ్లు, మగాళ్లు ఒక జాతి కాదు. రెండు వేర్వేరు గ్రహాలకు చెందినవారు. వాళ్లకి మనం, మనకి వాళ్లు గ్రహాంతరవాసులం. మనం ఏలియన్స్‌తోనే లవ్‌లో పడ్డాం. వాటినే పెళ్లి చేసుకున్నాం. మగ ఏలియన్స్‌కి, ఆడ ఏలియన్స్‌కు భావాలు రాత్రిపూట ఏదో గంటసేపు కలుస్తాయే తప్ప, తెల్లవారితే పూర్తి విరుద్ధంగా మారుతాయి. ఏదైనా సమస్య‌ వచ్చిందంటే మగాడు సైలెంట్‌ అయిపోతాడు. ఇంట్లో ఎవ్వరికీ చెప్పడు. వాడిలో వాడే కుళ్లిపోతుంటాడు. కానీ ఆడాళ్లు అలా కాదు.. సమస్యను అందరితో పంచుకుంటారు. ఆడాళ్ళు చాలా ప్రాక్టికల్‌గా ఉంటారు. వాళ్ల ప్రశ్నలన్నీ లాజికల్‌గా ఉంటాయి. ఈ మగ వెధవలకి ఆన్సర్స్‌ లేక, ఏం చెప్పాలో తెలియక ఆ టెన్షన్‌లో పెళ్ళాల మీద చేయిచేసుకుంటారు. అలా చేయొద్దు. దయచేసి మీ భార్యను గౌరవించండి.ఆర్గుమెంట్ చేసే సమయాల్లో మగ ఏలియన్స్‌ చాలా ఎగ్రెసివ్‌గా ఉంటాయి. తప్పుడు భాషను వాడుతాయి. దయచేసి ఆ సమయంలో బూతులు మాట్లాడకండి. బంతి కోర్టులో ఉందని గుర్తు పెట్టుకోండి. ఇష్టం ఉన్నా, లేకపోయినా వాళ్లు చెప్పింది చచ్చినట్లు వినండి. మనం తాళి కట్టింది ఏలియన్‌కి. రోజంతా అందరి దగ్గర అన్నీ భరించి వస్తావు. ఇక్కడ నీకెందుకు అంత పౌరుషం. భార్య చెప్పింది విను. వినను నేనంతే అంటే ఏలియన్స్‌ తాటతీస్తాయి అని పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చారు.

Related posts