telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

పూరి జగన్నాధ్ చేతులమీదుగా .. అశ్వథ్థామ ట్రైలర్ ..

nagasowrya in ragavendrarao special projecta

నటుడు నాగశౌర్య ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం ‘అశ్వథ్థామ’. రమణ తేజ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తుంది. జనవరి 31న సినిమా విడుదలకానుంది. ఈ చిత్రానికి హీరో నాగశౌర్యనే కథ అందించడం విశేషం. ఈ చిత్ర ట్రైలర్‌ను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే హీరోయిన్ సమంత చేతుల మీదుగా విడుదల చేసిన టీజర్, అలాగే చిత్ర ప్రోమో సాంగ్స్ మంచి స్పందనను అందుకున్న విషయం తెలిసిందే.

ఈ చిత్ర ట్రైలర్‌ను 23 జనవరి, 2020 సాయంత్రం 5గంటల 04 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ట్రైలర్ అద్భుతంగా వచ్చిందని, ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని చిత్రయూనిట్ తెలుపుతుంది. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు.

Related posts