• Home
  • వార్తలు
  • చంద్రబాబు అరెస్ట్‌ వారెంట్‌తో..బీజేపీకి సంబంధం లేదు
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు వార్తలు

చంద్రబాబు అరెస్ట్‌ వారెంట్‌తో..బీజేపీకి సంబంధం లేదు

Purandeswari, Comments, Chandrababu, Notices

మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ కోర్టు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు పంపిన అరెస్ట్‌ వారెంట్‌తో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ నాయకురాలు పురందేశ్వరి స్పష్టం చేశారు. శుక్రవారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై 2010లో కేసు నమోదైతే.. బీజేపీని ఎలా నిందిస్తారని ప్రశ్నించారు. ఏం జరిగినా టీడీపీ నేతలు.. కేంద్రానికి ఆపాదిస్తున్నారని ఆమె మండిపడ్డారు.

చంద్రబాబుకు వచ్చిన నోటీసులపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాలని సూచించారు. కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని వ్యాఖ్యనించడం సరికాదని అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అని.. తామే దానిని పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు.ఏపీకి నిధుల కేటాయింపులో అన్యాయం జరగడం లేదని, అయితే సాంకేతిక అంశాలతో కొంత జాప్యం జరిగి ఉండవచ్చునని పురంధేశ్వరి వెల్లడించారు.

Related posts

త్రిపుర లో మోడీ, అమిత్ షా

admin

బహ్రెయిన్‌లో సిలిండర్‌ పేలి నలుగురి మృతి.. ప్రమాదంపై చంద్రబాబు ఆరా

madhu

పాల్గర్ లో భారీ పేలుడు

admin

Leave a Comment