పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఐపీఎల్ సీజన్ లో బోణీ కొట్టింది. రాజస్థాన్‌ను దాని సొంతగడ్డపై 14 పరుగుల తేడాతో ఓడించింది. మొదట క్రిస్ గేల్ (79; 47 బంతుల్లో 8×4, 4×6), సర్ఫ్‌రాజ్ ఖాన్ (46 నాటౌట్; 29 బంతుల్లో 6×4, 1×6) మెరుపులతో కింగ్స్ ఎలెవన్.. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. అనంతరం రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 170 పరుగులే చేయగలిగింది. జోస్ బట్లర్ (69; 43 బంతుల్లో 10×4, 2×6) ఛేదనలో మంచి పునాది వేసినా.. రాయల్స్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. ముజీబ్ రెహ్మాన్ (2/31), అంకిత్ రాజ్‌పుత్ (2/33) ఆ జట్టుకు కళ్లెం వేశారు. గేల్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్:
కేఎల్ రాహుల్ (సి) బట్లర్ (బి) ధవళ్ 4; గేల్ (సి) త్రిపాఠి (బి) స్టోక్స్ 79; మయాంక్ (సి) ధవళ్ (బి) గౌతమ్ 22; సర్ఫ్‌రాజ్ నాటౌట్ 46; పూరన్ (సి) రహానె (బి) స్టోక్స్ 12; మన్‌దీప్ నాటౌట్ 5; ఎక్స్‌ట్రాలు 16 మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 184; వికెట్ల పతనం: 1-4, 2-60, 3-144, 4-167; బౌలింగ్: ధవళ్ కులకర్ణి 4-0-30-1; కృష్ణప్ప గౌతమ్ 4-0-32-1; ఆర్చర్ 4-0-17-0; స్టోక్స్ 4-0-48-2; ఉనద్కత్ 3-0-44-0; శ్రేయస్ గోపాల్ 1-0-5-0
రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్:
రహానె (బి) అశ్విన్ 27; బట్లర్ రనౌట్ 69; శాంసన్ (సి) అశ్విన్ (బి) కరన్ 30; స్మిత్ (సి) రాహుల్ (బి) కరన్ 20; స్టోక్స్ (సి) నాయర్ (బి) ముజీబ్ 6; త్రిపాఠి (సి) రాహుల్ (బి) ముజీబ్ 1; గౌతమ్ (సి) షమి (బి) రాజ్‌పుట్ 3; ఆర్చర్ రనౌట్ 2; ఉనద్కత్ (సి) అండ్ (బి) రాజ్‌పుట్ 1; గోపాల్ నాటౌట్ 1; ధవళ్ నాటౌట్ 5; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 170; వికెట్ల పతనం: 1-78, 2-108, 3-148, 4-150, 5-157, 6-158, 7-163, 8-164, 9-164; బౌలింగ్: కరన్ 4-0-52-2; ముజీబ్ 4-0-31-2; షమి 4-0-33-0; అశ్విన్ 4-0-20-1; అంకిత్ రాజ్‌పుట్ 4-0-33-2
నేటి మ్యాచ్ :
ఢిల్లీ క్యాప్టిటల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ మధ్య రాత్రి 8 గంటలకు జరుగనుంది.