telugu navyamedia
crime news Telangana

హైదరాబాద్ లో పంజాబీ ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నం

Crime

హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేట డీడీకాలనీలో పంజాబీ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. శీతల పానీయాల్లో  నిద్రమాత్రలు కలుపుకొని కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో దంపతులు మృతి చెందగా.. కుమారుడు, కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. మృతులు పవన్ కర్బంద, నీలం కర్బందగా గుర్తించారు.

అపస్మారకస్థితిలో ఉన్న కుమారుడు నిఖిల్, కుమార్తె మన్నును గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెండు రోజులుగా ఇంట్లో సందడి లేకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆర్థిక ఇబ్బందులే పంజాబీ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి కారణమని తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

బోర్డు తిప్పేసిన చిట్‌ఫండ్‌ సంస్థ.. రూ.20 కోట్లు కుచ్చుటోపీ!

vimala p

హైదరాబాద్ పోలీస్ : రక్షణ కోసం.. రౌడీషీటర్స్‌ మాడ్యూల్‌ యాప్‌..

vimala p

స్ముగ్లింగ్ : .. రోజుకో కొత్త ఆలోచన… లోదుస్తులలో 2కోట్లు పైనే..

vimala p