telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పబ్ లో రాహుల్ పై దాడి… పునర్నవి స్పందించకపోవడానికి కారణం ఇదేనా ?

Punarnavi

కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు పునర్నవి. ఇటీవల రాహుల్‌పై దాడి జరిగిన సమయంలోనూ పునర్నవి ఏం స్పందించకపోవడంతో నెటిజన్లలో పలు అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా పునర్నవి సోషల్ మీడియాలో  స్పందించారు. “నేను మళ్లీ వెనక్కి వచ్చేశా. మీరు గమనించారో లేదో.. కొన్ని రోజులుగా సోషల్ మీడియా నుంచి నేను బ్రేక్ తీసుకున్నా. రీల్ జీవితంలో వచ్చిన ప్రశంసలతో నా మెంటల్ హెల్త్‌ను సరిగా పట్టించుకోలేదు. చిన్న విరామం తీసుకోవడం తప్పేం కాదు. కాస్త మానసిక స్వాంతన పొంది, మళ్లీ మన కెరీర్‌పై దృష్టి పెట్టడం మంచిదే. నేను ఇప్పుడే అదే చేశా. ఈ విరామంలో ఓ బుక్ చదివా. నాకు ఇష్టమైన వారితో సమయాన్ని వెచ్చించా. ఇప్పుడు మళ్లీ బిజీ అయ్యేందుకు రెడీ అవుతున్నా’’ అని పునర్నవి కామెంట్ పెట్టారు. కాగా ఆమె మాటలను బట్టి చూస్తే.. పునర్నవి డిప్రెషన్‌తో బాధపడ్డట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

Related posts