telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్-3 : వరుణ్ అంటే ఎవరికీ ఇష్టం ఉండేది కాదు… పునర్నవి వ్యాఖ్యలు

punarnavi targeted this week in bigg boss 3

బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ 3 నుండి ఈ వారం మ‌హేశ్ విట్టా ఎలిమినేట్ అయ్యాడు. ఈ వారం ఎలిమినేష‌న్‌కు వ‌రుణ్ సందేశ్‌, రాహుల్‌, మ‌హేశ్ నామినేట్ అయ్యారు. ముగ్గురు బ‌ల‌మైన పోటీనిచ్చేవాళ్లే అయినా.. మ‌హేశ్‌కు మిగిలిన ఇద్ద‌రి కంటే క్రేజ్ త‌క్కువే. ఓట్లు మ‌హేశ్‌కి త‌క్కువ‌గా రావ‌డంతో ఆయ‌న ఎలిమినేట్ అయిన‌ట్లు నాగార్జున ప్ర‌క‌టించారు. ఇక బిగ్‌బాస్ హౌస్‌లో బాబాభాస్క‌ర్‌, వరుణ్ సందేశ్‌, వితిక‌, రాహుల్‌, అలీ రెజా, శివ జ్యోతి, శ్రీముఖి ఉన్నారు. మ‌రి వ‌చ్చేవారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. కాగా… బిగ్‌బాస్ హౌస్ నుంచి 11వ వారం వెళ్లిపోయింది లేడీ మోనార్క్ పునర్నవి భూపాలం. బిగ్‌బాస్ హౌస్ నుంచి సొంతింటికి చేరుకున్న ‘ఉయ్యాలా జంపాలా’ బ్యూటీ.. తన బిగ్‌బాస్ జర్నీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ రియాల్టీ షో తనకు మంచి ఎక్స్పీరియన్స్ అని తెలిపింది. బిగ్‌బాస్‌ను ఛాలెంజింగ్‌గా మాత్రమే తీసుకున్నానని.. అంతేతప్ప బిగ్‌బాసే తన లైఫ్‌ అని ఎప్పుడూ అనుకోలేదని స్పష్టంచేసింది. రిక్షా టాస్క్‌లో వితిక ముందే బాబా భాస్కర్ మూత్ర విసర్జన చేయాలనుకున్నారన్న పునర్నవి.. అది తనకు నచ్చలేదని వెల్లడించింది. కానీ సీజన్ 1, 2లో అలానే చేశారంటూ శ్రీముఖి, శివజ్యోతి వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారని విమర్శించింది. ఇక తనకు పుస్తకాలు చదవడం ఇష్టమని చెప్పింది పునర్నవి. హౌస్‌లో చెట్టు వద్ద కూర్చొని.. ఓ పుస్తకం ఇవ్వమని బిగ్‌బాస్‌ను రోజూ అడిగేదాన్నని తెలిపింది. ఒక్క బుక్ తెప్పిస్తే చదువుకుంటానని ఎన్ని సార్లు అడిగినా.. బిగ్‌బాస్ తన కోరికను నెరవేర్చలేదని వెల్లడించింది. మొదట వరుణ్‌ అంటే ఎవరికీ ఇష్టం ఉండేది కాదన్న పునర్నవి… భార్య వితిక కోసం ఇతరులపై అరుస్తున్నాడని అందరూ అనుకునేవారని చెప్పింది. వరుణ్, వితికతో ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవడం వల్లే వారితో కలవగలిగానని చెప్పుకొచ్చింది పునర్నవి. బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ నూతన్ నాయుడుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బిగ్‌బాస్ జర్నీని షేర్ చేసుకుంది.

Related posts