telugu navyamedia
ఆరోగ్యం

గుమ్మడి గింజల్లో ఔషధ గుణాలు ఎన్నో..

తెలుగు వారందరికి గుమ్మడి కాయ సుపరిచితమే. దీనిని శుభప్రథమైనదిగా భావిస్తారు. ఇది ప్రపంచములో అన్ని దేశాలలో దొరుకు తుంది. ఇటు వంటలకు అద్భుతమైన రుచి, అటు ఆనారోగ్యాలకు అద్భుతమైన ఔషధంగా ఉపయోగపడే ఈ గుమ్మడిని ఉపయోగించేటప్పుడు గుమ్మడి కాయను కట్ చేసుకొని, గింజలను పారేస్తుంటారు. అయితే ఆ పారేవేసే గుమ్మడి గింజల్లోని వైద్యపరమైన ఔషధ గుణగణాలు వున్నాయి.. వర్షాకాలం రాగానే చాలామంది జలుబు, దగ్గు, చర్మ సమస్యలు, జీవక్రియ సరిగా లేకపోవడం వంటివాటితో బాధపడుతుంటారు. అయితే, గుమ్మడికాయ తినడం వల్ల వీటిని చాలావరకూ దూరం చేయొచ్చు.

*ఈ విత్తనాల్లో జింక్, మెగ్నీషియం, మాంగనీస్, రాగి, ఇనుము, సెలీనియం, కాల్షియం మరియు ఫాస్పరస్ యొక్క అద్భుతమైన మూలంగా ఉన్నాయి. మరియు ప్రోటీన్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, బి-విటమిన్, బీటా-కెరోటిన్ మరియు విటమిన్ ఎ సమ్మేళనాలతో నిండి ఉంటుంది.

*గుమ్మడికాయలో ఎక్కువగా ‘విటమిన్ సి’ ఉంటుంది. దీని వల్ల తెల్లరక్తకణాలు వృద్ధి జరిగి.. రోగనిరోధక కణాలు మరింత శక్తివంతంగా పనిచేస్తాయి. గాయాలు త్వరగా తగ్గిపోతాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఉదరం, గొంతు, పాంక్రియాస్, రొమ్ము క్యాన్సర్లని దరిచేరనివ్వవు. గుమ్మడి గింజలు శృంగార సామర్థ్యం పెరుగుతుంది.

*గుమ్మడిలోని జింక్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందువల్ల జలుబు, దగ్గు, చర్మ సమస్యలను దూరం చేస్తాయి. గుమ్మడిలో క్యాలరీలో తక్కువ. అంతేకాకుండా కొంచెం తినగానే కడుపునిండుగా అనిపిస్తుంది. ఈ కారణంగా బరువు తగ్గుతారు.

*వీటిని రెగ్యులర్‌గా తినడం వల్ల గుండెసమస్యలు, బ్లడ్ షుగర్, క్రానిక్, కంటిసమస్యలు, క్యాన్సర్స్ వంటివాటిని రాకుండా ఉంచుతుంది. గుమ్మడికాయ విత్తనాలకు క్యాన్సర్‌తో పోరాడే ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి.

*గ్యాస్ట్రికి, ప్రోస్టేట్, బ్రెస్ట్, లంగ్, పేగు కేన్సర్ల నుండి విముక్తి కలిగిస్తుంది. మహిళలు గుమ్మడికాయ విత్తానాలను తరచుగా తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

*మధుమేహం ఉన్నవారు ప్రతి రోజు తింటే మధుమేహం అదుపులో ఉంటుంది. అదేపనిగా తినడం వల్ల గ్యాస్ మరియు ఉబ్బర సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కావున తగిన మోతాదులో తీసుకోవాలి.

Related posts