telugu navyamedia
రాజకీయ

కుంకుమ పండే పుల్వామాలో రక్తం చిందుతోంది

Pulwama History
ఇప్పుడు దేశమంతా వినిపిస్తున్న పేరు పుల్వామా ! ఫిబ్రవరి 14న సీ ఆర్ పి ఎఫ్  జవానులపై ఉగ్ర దాడితో ఇప్పుడు పుల్వామా వార్తల్లోకి వచ్చింది . జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని ఓ జిల్లా కేంద్రం పుల్వామా . జమ్మూ కాశ్మీర్ కు శ్రీనగర్ కు మధ్యన వుంది పుల్వామా . చలికాలంలో జమ్మూ రాజధానిగాను , వేసవికాలంలో శ్రీనగర్ రాజధానిగాను ఉంటుంది భారత సైనికులు  78 వాహనాల్లో 2547 మంది  జమ్మూ నుంచి ఉదయం 3. 30 గంటలకు శ్రీనగర్ కు బయలుదేరారు.  
Masood azhar pulwama attack pakistan
జమ్మూ నుంచి శ్రీనగర్  మధ్య దూరం 269 కిలో మీటర్లు . పుల్వామా నుంచి శ్రీనగర్ కేవలం 36 కిలోమీటర్లే.  ఈ ఘటన అవంతీపుర దగ్గర జరిగింది . ఎప్పుడూ  ఇంత మంది జవానులు ఒకేసారి బయలు దేరిన సందర్భాలు లేవు . సెలవులనుంచి ఎక్కువమంది జవానులు వచ్చి విధుల్లో చేరారు . అందరు  కలసి ఉత్సాహంతో వెడుతున్నారు . జమ్మూ కాశ్మీర్ హైవే లో పుల్వామా జిల్లాలోని అవంతీపురా  సమీపంలోకి కాన్వాయ్ వచ్చింది . అప్పుడు జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన మానవ బాంబు అదిల్ అహ్మద్ దార్ స్కార్పియో తో వాహనం శ్రేణి మధ్యలోకి వచ్చి  తనని తాను పేల్చుకున్నాడు .
pulvama attact conductor still in kashmir
అక్కడికక్కడే 40 మంది జవానులు చనిపోయారు . అదిల్ అహ్మద్ పుల్వామా జిల్లాలోని గుండి బాగ్ కు చెందినవాడు . సంఘటన జరిగిన  అవంతీపురాకు  శ్రీనగర్ 34 కిలోమీటర్ల దూరం లో వుంది . గత మూడు రోజుల నుంచి భారత సైన్యం పుల్వామాలో మోహరించి వుంది . పుల్వామా  ఉగ్రమూకలకు అడ్డాగా మారిందని అనుమానం వచ్చి సైన్యం మారువేసి ఉగ్రవాదులను మత్తు పెడుతోంది . భారత సైనికులపై దాడికి సూత్రధారిగా భావిస్తున్న ఘాజీ రషీద్ ను భద్రతా దళాలు కాల్చివేశాయి . సైనికుల పై దాడి జరిగిన ప్రదేశానికి 5 కిలోమీటర్ల దూరములోనే  ఈ ఎన్ కౌంటర్ జరిగింది . 
Pulwama History
1979లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోకొత్త జిల్లాగా పుల్వామా  అవతరించింది . పరిపాలనా సౌలభ్యం కోసం , శాంతి భద్రతల పరి రక్షణ కోసం దీనిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది . ఈ జిల్లాలో వున్న 7 తాలూకాల్లో  అవంతీపుర ఒకటి .  ఈ అవంతీపుర దగ్గరనే ఉగ్రదాడి జరిగింది . పుల్వామా 949 కిలో మీటర్ల విస్తీరణంలో వుంది .  ఈ జిల్లా జనాభా  5 లక్షల 70 వేలమంది . పుల్వామాను అక్షయ పాత్ర అంటారు . ఇక్కడ వరి , కుంకుమ పువ్వు,  నూనె గింజలు , బాదం  పంటలు పండుతాయి విస్తారంగా పండుతాయి . 
Pulwama History
యాపిల్  తోటలు కూడా ఎక్కువగానే ఉంటాయి . ఇక  రాష్ట్రము మొత్తం మీద అత్యధిక పాల ఉత్పత్తి   పుల్వామా లోనే  జరుగుతుంది ఈ జిల్లాలో  జమ్మూ అండ్ కాశ్మీర్ సిమెంట్ ఫ్యాక్టరీతో పాటు మరెన్నో పరిశ్రమల వాళ్ళ  ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది . 1999లో వాజ్ పేయ్ ప్రధాన మంత్రిగా వున్నప్పుడు ఢిల్లీ లాహోర్ కు  బస్సు సౌకర్యం కల్పించారు . ఒకప్పుడు పాకిస్తాన్ భారత్ లో అంతర్భాగం  కావడంతో రెండు దేశాలనుంచి వచ్చిపోయేవారు  వున్నారు . 
Pulwama History
వాజ్ పేయ్  స్పూర్తితో మన్మోహన్ సింగ్  ప్రధానిగా వున్నప్పుడు 2005లో శ్రీనగర్ నుంచి పాకిస్తాన్ ఆక్రమిత  కాశ్మీర్ రాజధాని ముజఫరాబాద్ కు బస్సు సౌకర్యం కల్పించారు . అంతకు ముందు అక్కడ రెండు దేశాల మధ్య రాకపోకలు లేవు . శ్రీనగర్  నుంచి ముజఫరాబాద్  180 కిలో మీటర్ల దూరంలో వుంది . ఆజాద్ కాశ్మీరుగా పిలుచుకునే ముజఫరాబాద్ పేరుకే స్వతంత్ర రాజ్యం . కానీ పెత్తనం మాత్రం పాకిస్తాన్ దే .  ఈ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్ర మూకలు తలదాసుకుంటున్నాయి .  
Pulwama History
ఇక్కడ నుంచి శ్రీనగర్ కు బస్సు సౌకర్యం ఏర్పడటంతో ఉగ్రమూకలు భారత్ లోకి చొరబడి  ఇక్కడి యువకులను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నారు . అలా ఉగ్రవాదిగా మారినవాడే గుండి భాగ్ అదిల్ అహ్మద్ దార్ . ఇలాంటి వారు ఇంకా పుల్వామాలో ఎందరు వున్నారో ? ఇప్పుడు పుల్వామా లో కూడా యువకులు  ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్టు ప్రభుత్వం గుర్తించింది .  అందమైన కాశ్మీర్ ఇప్పుడు ఉగ్రమూకల అడ్డాగా మారిపోయింది . ఎర్రటి కుంకుమ పూవు పండించే పొలాల్లో రక్తం చిందుతోంది !
-భగీరథ 
Pulwama History

Related posts